సోనాలి ఫోగట్ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు

సోనాలి ఫోగట్ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు

బీజేపీ నాయకురాలు సోనాలి ఫోగట్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. గోవా కోర్టులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేసింది. నిందితులైన సుధీర్ సంగ్వాన్, సుఖ్వీందర్ సింగ్ ల పేర్లను ఛార్జిషీటులో నమోదు చేసింది. ఆమెకు బలవంతంగా మత్తు మందు ఇచ్చి హత్య చేశారని సీబీఐ ఆరోపించింది. గోవాలోని కర్లీస్ రెస్టారెంట్‭ను సందర్శించిన సీబీఐ బృందం.. ఈ కేసుకు సంబంధించి సుధీర్ సంగ్వాన్, సుఖ్వీందర్ సింగ్ లతో పాటు మరో ఐదుగురిని  ఇప్పటికే అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసును సీబీఐకి అప్పగించే ముందు గోవా పోలీసులు ప్రాథమిక దర్యాప్తు చేపట్టారు. సెక్యూరిటీ కెమెరా ఫుటేజీలు ఉటంకిస్తూ అంజునా బీచ్‌లోని కర్లీ వద్ద ఆమె చేత బలవంతంగా మెథాంఫేటమిన్ డ్రగ్స్ ను నిందితులు తాగించినట్లు పోలీసులు గుర్తించారు. డబ్బుల కోసమే ఆమె హత్య చేశారని వాళ్లను కఠినంగా శిక్షించాలని కుటుంబసభ్యులు పట్టుబట్టడంతో ఈ కేసును సీబీఐకి బదిలీ చేశారు. 

ఇక.. ఫోగట్ చనిపోయే ఒక రోజు ముందు నిందితులతో కలిసి  గోవాలోని కర్లీస్ రెస్టారెంట్‭కు వెళ్లారు. అక్కడ డ్రగ్స్ తీసుకోమని ఫోగట్‭ను వారు బలవంతం చేశారు. అక్కడి నుంచి ఆమెను హోటల్ గ్రామండ్ లియోనీకి తీసుకువెళ్లారు. మరుసటి ఉదయం ఫోగట్ ఆనారోగ్యంలో ఆస్పత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మరణించినట్లు ఆంథోని ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. సోనాలి ఫోగట్ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఆమె 2008 నుండి బిజెపిలో ఉన్నారు. ఆరేళ్ల క్రితం మరణించిన ఆమె భర్త సంజయ్ ఫోగట్ కూడా సామాజిక, రాజకీయ వర్గాల్లో చురుకుగా వ్యవహరించారు.