గంగూలీ బయోపిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రణ్ బీర్ కపూర్

గంగూలీ బయోపిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రణ్ బీర్ కపూర్

రియల్ లైఫ్ క్యారెక్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయడం యాక్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి చాలా పెద్ద చాలెంజ్. వారిలా కనిపించాలి. వారిలానే నడవాలి, మాట్లాడాలి, నవ్వాలి. చెప్పాలంటే టోటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వారిలా మారిపోవాలి. కానీ పర్​ఫార్మెన్స్​కి స్కోప్​ ఉంటుంది కాబట్టి ఈ చాలెంజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని ఇష్టంగా యాక్సెప్ట్ చేస్తారు. రణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా అదే చేస్తున్నాడు. ఆల్రెడీ సంజయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దత్ బయోపిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‘సంజు’లో అద్భుతంగా నటించి మెప్పించిన రణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీర్.. త్వరలో క్రికెటర్​ సౌరవ్ గంగూలీ పాత్రలో కనిపించబోతున్నాడు. గంగూలీ బయోపిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాబోతోంది అంటూ బాలీవుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎప్పట్నుంచో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అఫీషియల్ అనౌన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ రాకపోవడంతో రూమర్ అయ్యుంటుంది అనుకున్నారంతా. అది పుకారు కాదని, నిజమేనని ఇప్పుడు గంగూలీయే క్లారిటీ ఇచ్చాడు. రీసెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఓ షోలో పాల్గొన్న గంగూలీ.. తన బయోపిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీయడానికి ఓ బాలీవుడ్​ దర్శకుడికి ఆల్రెడీ ఓకే చెప్పానన్నాడు. అతని పేరు మాత్రం అప్పుడే చెప్పనన్నాడు. ‘మీ పాత్రని హృతిక్ చేస్తే బాగుంటుంది కదా’ అని హోస్ట్ అడిగితే ఏమన్నాడో తెలుసా? ‘అందరూ హృతిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లా బాడీ పెంచాలి అంటుంటారు. కానీ నా బయోపిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నటిస్తే హృతిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తన బాడీని నాలా మార్చుకోవాల్సి ఉంటుంది. అది కరెక్ట్ కాదు. నా క్యారెక్టర్ చేయడానికి రణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీర్ కరెక్ట్’ అని చెప్పాడు. దాంతో గంగూలీ పాత్రలో రణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీర్ కనిపించబోతున్నాడని కన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫర్మ్ అయ్యింది. మిగతా వివరాలు తెలియాలంటే అనౌన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ వచ్చేవరకు ఆగాల్సిందే.