హైదరాబాద్ సిటీ, వెలుగు: చర్లపల్లి– తిరుపతి మధ్య వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలును నడిపేందుకు కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖ ఆమోదం తెలిపిందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. తిరుపతి–చర్లపల్లి రైలు నం.17443 ప్రతీ గురువారం, రైలు నం.17444 ప్రతీ శుక్రవారం నడవనుంది. ఈ నెల 28న తిరుపతి నుంచి చర్లపల్లికి, 29న చర్లపల్లి నుంచి తిరుపతికి రైలు ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు.
