పంజాగుట్ట, వెలుగు: గోసంరక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేక చట్టాలను అమలు చేయాలని భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి అధ్యక్షుడు రాఘవరెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం గోవులను అక్రమంగా తరలించే వారిని వదిలేసి, వాటిని కాపాడుతున్న గోసంరక్షకులపైనే అక్రమ కేసులు బనాయిస్తోందని ఆరోపించారు.
హిందువులంతా ఏకమై గోవులను కాపాడుకోవాలని సూచించారు. ఎంఐఎం నాయకులు గోసంరక్షకులను శత్రువులుగా భావిస్తున్నారని, ప్రభుత్వం వారిని కట్టడి చేసి గోవుల రక్షణకు చర్యలు చేపట్టాలని కోరారు. సమితి నాయకులు ఆలే బాస్కర్ రాజు, కరుడిమల్, జస్మత్ పాల్గొన్నారు.
