ఎంహెచ్​ఐకి ప్రత్యేక తయారీ కేంద్రం : ఆజాద్​ ఇంజనీరింగ్​

ఎంహెచ్​ఐకి ప్రత్యేక తయారీ కేంద్రం : ఆజాద్​ ఇంజనీరింగ్​

హైదరాబాద్​, వెలుగు: సిటీకి చెందిన ప్రిసిషన్​ ఇంజనీరింగ్​ కంపెనీ ఆజాద్​ ఇంజనీరింగ్​.. జపాన్​కు చెందిన మిత్సుబిషి హెవీ ఇండస్ట్రీస్​(ఎంహెచ్​ఐ) కోసం ప్రత్యేక మాన్యుఫాక్చరింగ్​ ఫెసిలిటీని నిర్మిస్తామని ప్రకటించింది. మేడ్చల్​లోని తునికి బొల్లారంలో నిర్మించబోయే ఈ ఫెసిలిటీ కోసం 20 మిలియన్​ డాలర్లు ఇన్వెస్ట్​ చేస్తారు. ఇందుకోసం బుధవారం భూమిపూజ చేశారు. ఈ ఫ్యాక్టరీలో హైలీ క్రిటికల్, కాంప్లెక్స్​పార్టులను తయారు చేస్తారు. 

11,800 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటయ్యే ఈ ప్లాంటు వల్ల 300 మందికి ఉద్యోగాలు వస్తాయి. భూమిపూజ కార్యక్రమంలో  ఆజాద్ ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ రాకేష్ చోప్దార్, ఎంహెచ్​ఐ ఛైర్మన్ టి. నాగయాసు, సంస్థ డిప్యూటీ సీఈఓ కె. తనక,  రాష్ట్ర పరిశ్రమలు  వాణిజ్యం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖల ప్రిన్సిపల్​ సెక్రెటరీ జయేష్ రంజన్ , ఎమ్మెల్యే కేపీ వివేకానంద తదితరులు పాల్గొన్నారు.