సికింద్రాబాద్​ మీదుగా స్పెషల్ ​ట్రైన్లు

సికింద్రాబాద్​ మీదుగా స్పెషల్ ​ట్రైన్లు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగులాక్‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌ కారణంగా ఆగిపోయిన రైళ్లు పట్టాలెక్కనున్నాయి. మన దగ్గర సికింద్రాబాద్​ మీదుగా కూడా స్పెషల్​ ట్రైన్స్​ నడువనున్నాయి. ఇందులో ఒకటి సికింద్రాబాద్‌‌‌‌‌‌‌‌ నుంచి ఢిల్లీకి వెళ్లనుంది. ఇది వీక్లీ ట్రైన్. మరో రెండు బెంగళూరు నుంచి ఢిల్లీ (డైలీ), చెన్నై సెంట్రల్‌‌‌‌‌‌‌‌ నుంచి ఢిల్లీ (బై వీక్లీ)కి వెళ్లనున్నాయి. ఇవి సికింద్రాబాద్​తో పాటు పలు స్టేషన్లలో ఆగనున్నాయి.

ఢిల్లీ – సికింద్రాబాద్‌‌‌‌‌‌‌‌ వీక్లీ : ఈ నెల 17న ఢిల్లీలో సాయంత్రం 4 గంటలకు ఢిల్లీ – సికింద్రాబాద్‌‌‌‌‌‌‌‌ సూపర్‌‌‌‌‌‌‌‌ఫాస్ట్‌‌‌‌‌‌‌‌ స్పెషల్‌‌‌‌‌‌‌‌ ట్రైన్‌‌‌‌‌‌‌‌ స్టార్ట్‌‌‌‌‌‌‌‌ అవుతుంది. ఇది మరుసటి రోజు మధ్యాహ్నం 2 గంటలకు సికింద్రాబాద్‌‌‌‌‌‌‌‌ చేరుకుంటుంది. అటు తర్వాత ఈ ట్రైన్‌‌‌‌‌‌‌‌ ప్రతి ఆదివారం ఢిల్లీ నుంచి నడుస్తుంది. ఇదే ట్రైన్‌‌‌‌‌‌‌‌ ఈ నెల 20న సికింద్రాబాద్‌‌‌‌‌‌‌‌లో మధ్యాహ్నం 1.15 గంటలకు బయలుదేరుతుంది. ఈ ట్రైన్‌‌‌‌‌‌‌‌ మరుసటి రోజు ఉదయం 10.4 0 గంటలకు ఢిల్లీకి చేరుకుంటుంది. సికింద్రాబాద్​ నుంచి ఇది ప్రతి బుధవారం ఢిల్లీకి వెళ్తుంది. ఈ ట్రైన్​ వచ్చేటప్పుడు, పోయేటప్పుడు నాగ్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌, భోపాల్‌‌‌‌‌‌‌‌, ఝాన్సీ స్టేషన్లలో ఆగుతుంది.

చెన్నై సెంట్రల్‌‌‌‌‌‌‌‌ – ఢిల్లీ బై వీక్లీ  : చెన్నై సెంట్రల్‌‌‌‌‌‌‌‌ – ఢిల్లీ ట్రైన్స్​ వారంలో (బై వీక్లీ) రెండు సార్లు వెళ్తాయి. ఈ నెల 13 నుంచి ప్రతి బుధ, శుక్రవారాల్లో ఢిల్లీలో సాయంత్రం 4 గంటలకు బయలుదేరి, రెండు రోజుల తర్వాత చెన్నై సెంట్రల్‌‌‌‌‌‌‌‌కు చేరుకుంటాయి. ఇవే రైళ్లు ఈ నెల 15 నుంచి చెన్నై సెంట్రల్‌‌‌‌‌‌‌‌ నుంచి ప్రతి శుక్ర, ఆదివారాల్లో ఉదయం 6.35 గంటలకు బయలుదేరుతాయి. విజయవాడ, వరంగల్‌‌‌‌‌‌‌‌, నాగపూర్‌‌‌‌‌‌‌‌, ఝాన్సీ, ఆగ్రా స్టేషన్లలో  ఈ రైళ్లు వచ్చేటప్పుడు, పోయేటప్పుడు ఆగుతాయి.

బెంగళూరు – ఢిల్లీ డైలీ : ఈ నెల 12 న రాత్రి 9.15 గంటలకు ఢిల్లీలో న్యూఢిల్లీ – కేఎస్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ బెంగళూరు ట్రైన్‌‌‌‌‌‌‌‌ బయలుదేరి తర్వాతి రోజు సాయంత్రం 6.20 గంటలకు సికింద్రాబాద్‌‌‌‌‌‌‌‌లో చేరుకుంటుంది. బెంగళూరుకు రెండు రోజుల కు చేరుకుంటుంది. ఈ నెల 12న రాత్రి 8.30కు కేఎస్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ బెంగళూరులో మరో ట్రైన్‌‌‌‌‌‌‌‌ స్టార్ట్‌‌‌‌‌‌‌‌ అవుతుంది. నెక్స్ట్‌‌‌‌‌‌‌‌ డే ఉదయం 7.55 గంటలకు సికింద్రాబాద్‌‌‌‌‌‌‌‌ స్టేషన్‌‌‌‌‌‌‌‌కు చేరుకుంటుంది. రెండో రోజు ఉదయం 5.55 గంటలకు ఢిల్లీ వెళ్తుంది. ఈ రైళ్లు వచ్చేటప్పుడు, పోయేటప్పుడు అనంతపురం, గుంతకల్‌‌‌‌‌‌‌‌, సికింద్రాబాద్‌‌‌‌‌‌‌‌, నాగ్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌, భోపాల్‌‌‌‌‌‌‌‌, ఝాన్సీ స్టేషన్లలో ఆగుతాయి.

ఐఆర్‌‌‌‌‌‌‌‌సీటీసీ ద్వారానే బుకింగ్

రైళ్ల రాకపోకలకు సంబంధించి సౌత్​ సెంట్రల్​ రైల్వే పలు గైడ్‌‌‌‌‌‌‌‌లైన్స్‌‌‌‌‌‌‌‌, ఇన్‌‌‌‌‌‌‌‌స్ట్రక్షన్స్‌‌‌‌‌‌‌‌ జారీ చేసింది. ఈ ప్రత్యేక రైళ్లలో ఎయిర్ కండిషన్డ్ క్లాసెస్‌‌‌‌‌‌‌‌ మాత్రమే ఉంటాయి. రాజధాని రైళ్లలో వర్తించే టికెట్‌‌‌‌‌‌‌‌ చార్జీలను ఈ ట్రైన్స్‌‌‌‌‌‌‌‌లో తీసుకుంటారు. క్యాటరింగ్ చార్జీలు టికెట్‌‌‌‌‌‌‌‌ ధరల్లో చేర్చడంలేదు. రైలులో దుప్పట్లు, టవల్స్‌‌‌‌‌‌‌‌, కర్టెన్లు అందించరు. ప్యాసింజర్స్‌‌‌‌‌‌‌‌ సొంతంగా తెచ్చుకోవాలి. టికెట్లను ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో (www.irctc.co.in) లేదా మొబైల్ యాప్ ద్వారా మాత్రమే బుక్ చేసుకోవచ్చు. బుకింగ్ ఏజెంట్ల ద్వారా టిక్కెట్లు అనుమతించరు. వారం రోజుల ముందు రిజిర్వేషన్లు చేసుకోవచ్చు. కన్ఫర్మ్‌‌‌‌‌‌‌‌ అయిన టికెట్‌‌‌‌‌‌‌‌ ఉంటేనే స్టేషన్లకు అనుమతిస్తారు. ఆర్‌‌‌‌‌‌‌‌ఏసీ, వెయిటింగ్‌‌‌‌‌‌‌‌ లిస్ట్‌‌‌‌‌‌‌‌, తత్కాల్, ప్రీమియం తత్కాల్, కరెంట్‌‌‌‌‌‌‌‌ బుకింగ్‌‌‌‌‌‌‌‌ ఉండదు. 24 గంటల ముందు మాత్రమే టికెట్‌‌‌‌‌‌‌‌ క్యాన్సిల్‌‌‌‌‌‌‌‌ చేసుకోవచ్చు. 50 శాతం డబ్బులు మాత్రమే రిఫండ్‌‌‌‌‌‌‌‌ చేస్తారు.

మే 17 నుంచి ఫ్లైట్స్?