కొన్ని రూట్లలో కిలోమీటరుకు కేవలం రూ.1.75 ధరతో టికెట్లను విక్రయిస్తున్నట్టు స్పైస్ జెట్ ఎయిర్లైన్స్ ప్రకటించింది. అంతర్జాతీయ రూట్లలో కిలోమీటరుకు రూ.2.50 చార్జ్ చేస్తామని తెలిపింది. ఈ నెల 5–9 తేదీల మధ్య ఈ టికెట్లను కొనుక్కోవచ్చు. మొత్తం 3.50 లక్షల టికెట్లను అమ్ముతామని కంపెనీ తెలిపింది. ఈ ఏడాది సెప్టెంబరు 25లోపు చేసే ప్రయాణాల కోసం ఈ ఆఫర్ వర్తిస్తుంది. తక్కువ దూరం ఉండే జమ్మూ–శ్రీనగర్, చెన్నై–బెంగళూరు, కొచ్చి బెంగళూరు, హుబ్లి–బెంగళూరు రూట్లలో టికెట్ కేవలం ధర రూ.899లు మాత్రమేనని స్పైస్ జెట్ తెలిపింది.
