IPL 2026: ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తో జరుగుతున్న హైవోల్టెజ్ పోరులో సన్‌రైజర్స్ హైదరబాద్ జట్టు అద్భుతమైన బ్యాటింగ్ తో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. టాస్ ఓడిపోయిన తర్వాత తొలుత బ్యాటింగ్ కి వచ్చిన ఆరెంజ్ ఆర్మీకి అద్భుతమైన ఓపెనింగ్ లభించింది. క్లాసీ హాఫ్ సెంచరీతో హెన్రిచ్ క్లాసెన్ చెలరేగగా.. SRH స్టార్ బ్యాటర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ కొట్టే కొట్టుడికి కేకేఆర్ బౌలర్లు విలవిలలాడిపోయారు. 82 పరుగుల వద్ద తొలి వికెట్ భాగస్వామ్యాన్కి బ్రేక్ పడింది.
ఫస్ట్ బ్యాటింగ్ కి వచ్చిన కాటేరమ్మ కొడుకులు ట్రావిస్ హెడ్ రెండో ఓవర్ నుంచి ఎటాకింగ్ బ్యాటింగ్ మొదలు పెట్టగా.. అభిషేక్ శర్మ మాత్రం తొలి బంతి నుంచే బాదడం స్టార్ట్ చేశాడు. దీంతో 4. 1 ఓవర్లోనే 50 పరుగుల మార్క్ ని SRH అందుకుంది. కానీ ఆ తర్వాత కార్తిక్ త్యాగి (5. 4) బౌలింగ్ లో హెడ్ (21 బంతుల్లో 6 ఫోర్లు 3 సిక్సులతో 46 పరుగులు) కెమెరూన్ గ్రీన్ కి క్యాచ్ ఇచ్చి హెడ్ పెవిలియన్ కు చేరుకున్నాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ ఇషన్ కిషన్ కూడా వరుసగా రెండు ఫోర్లు కొట్టి మంచి ఊపుమీద కనిపించినప్పటికీ.. బ్లెస్సింగ్ ముజరబానీ (8.2) బౌలింగ్ లో రింకు సింగ్ కి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఆ తర్వాత కాసేపటికే (8.4 ఓవర్) అభిషేక్ శర్మ (21బంతుల్లో 4 ఫోర్లు 4 సిక్సులతో 48 పరుగులు) కూడా వరుణ్ చక్రవర్తికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కి చేరగా, ఆ తర్వా వచ్చిన అనికేత్ వర్మ (1) ఇలా వచ్చి అలా మైదానం వీడాడు.
ఇక 8 నుంచి 12 ఓవర్ల వరకు సన్‌రైజర్స్ హైదరబాద్ జట్టు పరుగులు చేయడంలో కాస్త ఇబ్బంది పడింది. కానీ నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ నెమ్మదిగా బ్యాటింగ్ చేస్తూ, ఆరెంజ్ ఆర్మీ జట్టు వికెట్ కోల్పోకుండా స్కోర్ బోర్డుని ముందుకు నడిపిస్తుండగా 200 పరుగుల వద్ద నితీష్ కుమార్ రెడ్డి (24 బంతుల్లో 4 ఫోర్లు 1 సిక్సుతో 39 పరుగులు), సలీల్ ఆరోరాని గోల్డెన్ డకౌట్ చేశాడు వైభవ్ ఆరోరా.. దీంతో ఒకే ఓవర్లో వరుసగా రెండు వికెట్లను వైభవ్ తీసుకోవడంతో SRH ఇబ్బందుల్లో పడినప్పటికీ.. చివర్లో క్లాసెన్ (35 బంతుల్లో 4 ఫోర్లు 1 సిక్సుతో 52 పరుగులు) అద్భుతమైన హాఫ్ సెంచరీ చేసి ముజరబానీ బౌలింగ్ లో అవుట్ కాగా.. హర్ష్ దూబే వరుసగా రెండు ఫోర్లు కొట్టి హైదరాబాద్ భారీ స్కోర్ చేయడంలో కీ రోల్ పోషించాడు. కేకేఆర్ బౌలర్లలో ముజరబానీ 4 వికెట్లు తీసుకుని ఆరెంజ్ ఆర్మీ బ్యాటింగ్ లైనఫ్ ని దెబ్బకొట్టగా, వైభన్ ఆరోరా రెండు వికెట్లు తీసుకోగా, కార్తిక్ త్యాగి, అనుకూల్ రాయ్ చెరో వికెట్ పడగొట్టారు.
