జనగామ జిల్లాలో తీవ్ర విషాద ఘటన జరిగింది. ప్రమాదవశాత్తు సైకిల్ తో సహా కాలువలో పడి ఇద్దరు మైనర్లు మృతి చెందిన ఘటన కుటుంబ సభ్యుల్లో తీవ్ర వేదనను మిగిల్చింది. 2026 ఏప్రిల్ 2న చిల్పూర్ మండలం నష్కల్ గ్రామంలో జరిగింది ఈ ఘటన.
సాయంత్రం సైకిల్ పై వెళ్తున్న మైనర్లు నూనె మనోజ్(12), గుటం అకిరా నందన్ (13) కాలువలో పడి మృతి చెందారు. గమనించిన స్థానికులు మృతదేహాలను బయటికి తీసి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి దర్యాప్తు ప్రారంభించారు.
మృతులు ఇద్దరూ వంగాలపల్లికి చెందిన వారిగా గుర్తించారు. ఇంకా లోకజ్ఞానం కూడా తెలియని బిడ్డల మరణ వార్త విని తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. దీంతో వంగాలపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రమాదవశాత్తు జరిగిందా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
