SRH vs KKR: సన్‌‌‌‌‌‌‌‌ మళ్లీ ఢమాల్‌‌‌‌‌‌‌‌..5 రన్స్ తేడాతో కోల్కతా చేతిలో ఓటమి

SRH vs KKR: సన్‌‌‌‌‌‌‌‌ మళ్లీ ఢమాల్‌‌‌‌‌‌‌‌..5 రన్స్ తేడాతో కోల్కతా  చేతిలో ఓటమి

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌: సొంతగడ్డపై సన్‌‌‌‌‌‌‌‌రైజర్స్‌‌‌‌‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ మళ్లీ ఫెయిలైంది. బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌ వైఫల్యంతో చిన్న టార్గెట్‌‌‌‌‌‌‌‌ను కూడా ఛేదించలేకపోయింది. దీంతో గురువారం జరిగిన లీగ్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో కోల్‌‌‌‌‌‌‌‌కతా 5 రన్స్‌‌‌‌‌‌‌‌ తేడాతో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌పై గెలిచింది. టాస్‌‌‌‌‌‌‌‌ గెలిచి బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌ చేసిన కోల్‌‌‌‌‌‌‌‌కతా 20 ఓవర్లలో 171/9 స్కోరు చేసింది. రింకూ సింగ్‌‌‌‌‌‌‌‌ (35 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 4 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌‌‌‌‌తో 46), నితీష్‌‌‌‌‌‌‌‌ రాణా (31 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 3 ఫోర్లు, 3 సిక్స్‌‌‌‌‌‌‌‌లతో 42)తో పాటు జేసన్‌‌‌‌‌‌‌‌ రాయ్‌‌‌‌‌‌‌‌ (20), ఆండ్రీ రసెల్‌‌‌‌‌‌‌‌ (24) రాణించారు. తర్వాత హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ 20 ఓవర్లలో 166/8 స్కోరుకే పరిమితమైంది. కెప్టెన్‌‌‌‌‌‌‌‌ మార్‌‌‌‌‌‌‌‌క్రమ్‌‌‌‌‌‌‌‌ (40 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 4 ఫోర్లతో 41) టాప్‌‌‌‌‌‌‌‌ స్కోరర్‌‌‌‌‌‌‌‌. క్లాసెన్‌‌‌‌‌‌‌‌ (36) పోరాడి విఫలమయ్యాడు. వరుణ్​కు ‘ప్లేయర్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌‌‌‌‌’ అవార్డు లభించింది. 

రింకూ, నితీష్‌‌‌‌‌‌‌‌ మెరుపులు..

ముందుగా బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌కు దిగిన కోల్‌‌‌‌‌‌‌‌కతాను స్టార్టింగ్‌‌‌‌‌‌‌‌లో కట్టడి చేసిన హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ బౌలర్లు మధ్యలో ఆపలేకపోయారు. రెండో ఓవర్‌‌‌‌‌‌‌‌లో జాన్సెన్‌‌‌‌‌‌‌‌ (2/24).. ఆరు బాల్స్‌‌‌‌‌‌‌‌ తేడాలో రెహమానుల్లా గుర్బాజ్‌‌‌‌‌‌‌‌ (0), వెంకటేశ్‌‌‌‌‌‌‌‌ అయ్యర్‌‌‌‌‌‌‌‌ (7)ను ఔట్‌‌‌‌‌‌‌‌ చేసి షాకిచ్చాడు. ఫలితంగా 16/2 స్కోరు వద్ద క్రీజులోకి వచ్చిన కెప్టెన్‌‌‌‌‌‌‌‌ నితీష్‌‌‌‌‌‌‌‌ కుదురుకోవడానికి టైమ్‌‌‌‌‌‌‌‌ తీసుకున్నాడు. అయితే ఐదో ఓవర్‌‌‌‌‌‌‌‌లో కార్తీక్‌‌‌‌‌‌‌‌ త్యాగీ (1/30).. జేసన్‌‌‌‌‌‌‌‌ను పెవిలియన్‌‌‌‌‌‌‌‌కు పంపడంతో కేకేఆర్‌‌‌‌‌‌‌‌ 35/3తో కష్టాల్లో పడింది. ఈ దశలో నితీష్‌‌‌‌‌‌‌‌కు తోడైన రింకూ సింగ్‌‌‌‌‌‌‌‌ ఆఖరి ఓవర్‌‌‌‌‌‌‌‌ వరకు క్రీజులో ఉండి మంచి పార్ట్‌‌‌‌‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌షిప్స్‌‌‌‌‌‌‌‌ నిర్మించాడు. ఫోర్‌‌‌‌‌‌‌‌తో టచ్‌‌‌‌‌‌‌‌లోకి వచ్చిన అతను 8వ ఓవర్‌‌‌‌‌‌‌‌లో సిక్స్‌‌‌‌‌‌‌‌తో జోరందుకున్నాడు. తర్వాతి ఓవర్‌‌‌‌‌‌‌‌లో రెండు ఫోర్లు దంచాడు. పదో ఓవర్‌‌‌‌‌‌‌‌లో నితీష్‌‌‌‌‌‌‌‌ 4, 6, 6తో 17 రన్స్‌‌‌‌‌‌‌‌ రాబట్టాడు. దీంతో పవర్‌‌‌‌‌‌‌‌ప్లేలో 49/3తో ఉన్న నైట్‌‌‌‌‌‌‌‌రైడర్స్‌‌‌‌‌‌‌‌ స్కోరు ఫస్ట్‌‌‌‌‌‌‌‌ టెన్‌‌‌‌‌‌‌‌లో 90/3కి చేరింది. ఇక ఫర్వాలేదనుకున్న టైమ్‌‌‌‌‌‌‌‌లో 12వ ఓవర్‌‌‌‌‌‌‌‌లో నితీష్‌‌‌‌‌‌‌‌ ఇచ్చిన క్యాచ్‌‌‌‌‌‌‌‌ను మిడాన్‌‌‌‌‌‌‌‌లో మార్‌‌‌‌‌‌‌‌క్రమ్‌‌‌‌‌‌‌‌ (1/24) అద్భుతంగా అందుకున్నాడు. దీంతో నాలుగో వికెట్‌‌‌‌‌‌‌‌కు 61 రన్స్‌‌‌‌‌‌‌‌ పార్ట్‌‌‌‌‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌ ముగిసింది. ఈ దశలో రసెల్‌‌‌‌‌‌‌‌ రెండు సిక్స్‌‌‌‌‌‌‌‌లు, ఓ ఫోర్‌‌‌‌‌‌‌‌ కొట్టి జోరు చూపెట్టినా, మార్కండే (1/29) దెబ్బకు 15వ ఓవర్‌‌‌‌‌‌‌‌లో పెవిలియన్‌‌‌‌‌‌‌‌కు చేరాడు. ఐదో వికెట్‌‌‌‌‌‌‌‌కు 31 రన్స్‌‌‌‌‌‌‌‌ భాగస్వామ్యం ముగిసింది. తర్వాతి ఓవర్‌‌‌‌‌‌‌‌లో సునీల్‌‌‌‌‌‌‌‌ నరైన్‌‌‌‌‌‌‌‌ (1)ను భువీ (1/33) బోల్తా కొట్టించాడు. ఓవైపు వికెట్లు పడినా రెండో ఎండ్‌‌‌‌‌‌‌‌లో రింకూ సిక్స్‌‌‌‌‌‌‌‌తో వేగంగా రన్స్‌‌‌‌‌‌‌‌ రాబట్టాడు. మధ్యలో శార్దూల్‌‌‌‌‌‌‌‌ (8) ఓ ఫోర్‌‌‌‌‌‌‌‌ కొట్టి 18వ ఓవర్‌‌‌‌‌‌‌‌లో వెనుదిరిగాడు. 19వ ఓవర్‌‌‌‌‌‌‌‌లో అనుకూల్‌‌‌‌‌‌‌‌ రాయ్‌‌‌‌‌‌‌‌ (13 నాటౌట్‌‌‌‌‌‌‌‌) రెండు ఫోర్లు కొట్టి 13 రన్స్‌‌‌‌‌‌‌‌ రాబట్టాడు. లాస్ట్‌‌‌‌‌‌‌‌ ఓవర్‌‌‌‌‌‌‌‌లో నటరాజన్‌‌‌‌‌‌‌‌ (2/30) వరుస బాల్స్‌‌‌‌‌‌‌‌లో రింకూ, హర్షిత్‌‌‌‌‌‌‌‌ రాణా (0)ను పెవిలియన్‌‌‌‌‌‌‌‌ చేర్చాడు. 

పెవిలియన్‌‌‌‌‌‌‌‌కు క్యూ..

ఛేజింగ్‌‌‌‌‌‌‌‌లో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు మెరుగైన ఆరంభం దక్కలేదు. కోల్‌‌‌‌‌‌‌‌కతా బౌలర్లు లైన్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌ లెంగ్త్‌‌‌‌‌‌‌‌కు కట్టుబడటంతో సన్‌‌‌‌‌‌‌‌ టాప్‌‌‌‌‌‌‌‌ ఆర్డర్‌‌‌‌‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌లో చేతులెత్తేసింది. మయాంక్‌‌‌‌‌‌‌‌ అగర్వాల్‌‌‌‌‌‌‌‌ (18), అభిషేక్‌‌‌‌‌‌‌‌ శర్మ (9), రాహుల్‌‌‌‌‌‌‌‌ త్రిపాఠి (20)తో పాటు హ్యారీ  బ్రూక్‌‌‌‌‌‌‌‌ (0) ఘోరంగా నిరాశపర్చారు. 6.2 ఓవర్లకే ఈ నలుగురు పెవిలియన్‌‌‌‌‌‌‌‌ బాట పట్టడంతో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ 54/4తో ఎదురీత మొదలుపెట్టింది. ఈ దశలో కెప్టెన్‌‌‌‌‌‌‌‌ మార్‌‌‌‌‌‌‌‌క్రమ్‌‌‌‌‌‌‌‌, క్లాసెన్‌‌‌‌‌‌‌‌ కాసేపు కేకేఆర్‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌‌‌‌‌‌‌‌ను దీటుగా ఎదుర్కొన్నారు. ఫస్ట్‌‌‌‌‌‌‌‌ టెన్‌‌‌‌‌‌‌‌లో 75/4తో కాస్త కుదురుకున్నారు. 11వ ఓవర్‌‌‌‌‌‌‌‌లో క్లాసెన్‌‌‌‌‌‌‌‌ రెండు భారీ సిక్సర్లు కొడితే, తర్వాతి ఓవర్‌‌‌‌‌‌‌‌లో మార్‌‌‌‌‌‌‌‌క్రమ్‌‌‌‌‌‌‌‌ రెండు ఫోర్లతో అలరించాడు. హర్షిత్‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో మరో సిక్స్‌‌‌‌‌‌‌‌ కొట్టి 15వ ఓవర్‌‌‌‌‌‌‌‌లో క్లాసెన్‌‌‌‌‌‌‌‌ ఔటయ్యాడు. దీంతో ఐదో వికెట్‌‌‌‌‌‌‌‌కు 70 రన్స్‌‌‌‌‌‌‌‌ భాగస్వామ్యం ముగిసింది. ఈ ఓవర్‌‌‌‌‌‌‌‌లో మార్‌‌‌‌‌‌‌‌క్రమ్‌‌‌‌‌‌‌‌, సమద్‌‌‌‌‌‌‌‌ (21) చెరో ఫోర్‌‌‌‌‌‌‌‌ కొట్టడంతో ఎస్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌‌‌‌‌ 134/5 స్కోరుతో నిలిచింది. ఇక 30 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 38 రన్స్‌‌‌‌‌‌‌‌ చేయాల్సిన దశలో 17వ ఓవర్‌‌‌‌‌‌‌‌లో మార్‌‌‌‌‌‌‌‌క్రమ్‌‌‌‌‌‌‌‌ ఔట్‌‌‌‌‌‌‌‌తో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కొద్దిసేపటికే జాన్సెన్‌‌‌‌‌‌‌‌ (1) కూడా వెనుదిరిగాడు. సమద్‌‌‌‌‌‌‌‌తో కలిసిన భువనేశ్వర్‌‌‌‌‌‌‌‌ (5 నాటౌట్‌‌‌‌‌‌‌‌) ఆశలు రేకెత్తించినా వరుణ్​  (1/20) అడ్డుకున్నాడు.