లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ముంబై: గ్లోబల్ మార్కెట్లు బాగుండటం, ఎనర్జీ, బ్యాంకింగ్,  ఎఫ్‌‌‌‌ఎమ్‌‌‌‌సీజీ కౌంటర్లలో భారీ కొనుగోళ్ల మధ్య ఈక్విటీ బెంచ్‌‌‌‌మార్క్ ఇండెక్స్​లు వరుసగా మూడవ రోజూ ర్యాలీ చేశాయి. 30 షేర్ల బీఎస్‌‌‌‌ఈ సెన్సెక్స్ 549.62 పాయింట్లు (0.94 శాతం) పెరిగి 58,960.60 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో ఇది 732.68 పాయింట్లు (1.25 శాతం) జూమ్ చేసి 59,143.66 పాయింట్లకు చేరుకుంది.  ఎన్‌‌‌‌ఎస్‌‌‌‌ఈ నిఫ్టీ 175.15 పాయింట్లు (1.01 శాతం) పెరిగి 17,486.95 వద్ద ముగిసింది. సెన్సెక్స్ ప్యాక్‌‌‌‌లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  అత్యధికంగా 3.41 శాతం లాభపడింది, ఐటీసీ, నెస్లే ఇండియా, భారతీ ఎయిర్‌‌‌‌టెల్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎల్​&టీ, ఎం&ఎం, రిలయన్స్ ఇండస్ట్రీస్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. హెచ్‌‌‌‌డీఎఫ్‌‌‌‌సీ, ఎన్‌‌‌‌టీపీసీ,  టెక్ మహీంద్రా, సన్ ఫార్మా, హెచ్‌‌‌‌డీఎఫ్‌‌‌‌సీ బ్యాంక్ వంటి కొన్ని షేర్లు మాత్రమే 0.72 శాతం వరకు పడిపోయాయి. " గ్లోబల్ మార్కెట్లు ర్యాలీ చేస్తున్న కారణంగా భారతీయ మార్కెట్ లాభాలను కొనసాగిస్తోంది.

క్రూడ్ ధరల తగ్గుదల, రెండో క్వార్టర్​లో కార్పొరేట్ ఆదాయాలు కూడా బాగున్నాయి. సెప్టెంబర్‌‌‌‌లో ఇన్​ఫ్లేషన్ గరిష్ట స్థాయికి చేరుకున్నా, ఇకపై తగ్గుముఖం పడుతుందన్న నమ్మకం ఉంది. అందుకే  ఆర్థిక మార్కెట్ ఆరోగ్యకరంగా కనిపిస్తోంది" అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ అన్నారు. మరో రీసెర్చ్​సంస్థ రెలిగేర్ బ్రోకింగ్ లిమిటెడ్​కు చెందిన అజిత్ మిశ్రా మాట్లాడుతూ మార్కెట్లు ఇటీవల పుంజుకోవడం ప్రపంచ సూచీలలో రికవరీకి సంకేతమని చెప్పవచ్చని అన్నారు. ఇదిలా ఉంటే, బ్రాడ్​ మార్కెట్‌‌‌‌లో, బిఎస్‌‌‌‌ఇ మిడ్‌‌‌‌క్యాప్ గేజ్ 1.06 శాతం, స్మాల్‌‌‌‌క్యాప్ ఇండెక్స్ 0.71 శాతం పెరిగింది. క్యాపిటల్ గూడ్స్ 1.97 శాతం, రియల్టీ 1.76 శాతం, ఇండస్ట్రియల్స్  1.71 శాతం , ఆటో 1.50 శాతం , పవర్  1.46 శాతం , యుటిలిటీస్  1.46 శాతం పెరగడంతో అన్ని బీఎస్‌‌‌‌ఈ రంగాల సూచీలు గ్రీన్‌‌‌‌లో ముగిశాయి. ఎఫ్​ఎంసీజీ 1.22 శాతం, ఎనర్జీ 1.13 శాతం పెరిగాయి.

సియోల్, టోక్యో, హాంకాంగ్‌‌‌‌ వంటి ఇతర ఆసియా మార్కెట్లు లాభాలతో ముగియగా, షాంఘై నష్టాల్లో ముగిసింది. మిడ్ సెషన్ డీల్స్‌‌‌‌లో యూరప్‌‌‌‌లోని స్టాక్ ఎక్స్ఛేంజీలు సానుకూలంగా ట్రేడ్ అవుతున్నాయి. వాల్ స్ట్రీట్ సోమవారం గణనీయంగా పెరిగింది. అంతర్జాతీయ చమురు బెంచ్‌‌‌‌మార్క్ బ్రెంట్ క్రూడ్ 0.65 శాతం తగ్గి బ్యారెల్‌‌‌‌కు 91.02 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మంగళవారం  ట్రేడ్‌‌‌‌లో  డాలర్‌‌‌‌తో రూపాయి  ప్రారంభ లాభం 7 పైసలు తగ్గి 82.37 (తాత్కాలిక) వద్ద ముగిసింది. ఫారిన్​ ఇన్​స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (ఎఫ్‌‌‌‌ఐఐలు) సోమవారం భారత క్యాపిటల్ మార్కెట్‌‌‌‌లో రూ. 372.03 కోట్ల విలువైన షేర్లను అమ్మేశారు.