ప్లేట్ మ్యాగీ రూ.400.. ఎందుకు అంత ధర.. బంగారం కలిపాడా ఏంటీ..

ప్లేట్ మ్యాగీ రూ.400.. ఎందుకు అంత ధర.. బంగారం కలిపాడా ఏంటీ..

భారతదేశంలో వివిధ రకాల రుచికరమైన స్ట్రీట్ ఫుడ్స్ ఉన్నాయి. అందులో మ్యాగీ ఒకటి. మామూలుగా మ్యాగీ అంటే రూ.30 నుంచి రూ.150 ఉంటుంది. మరికొన్ని రెస్టారెంట్లలో మాత్రం ఈ ధర మరింత ఎక్కువగా ఉంటుంది. కానీ ఓ వీధి వ్యాపారి మాత్రం దీన్ని ఏకంగా రూ.400 విక్రయిస్తున్నాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసి ఇంటర్నెట్ యూజర్స్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఇన్ స్టాగ్రామ్ లో షేర్ అవుతోన్న ఈ వీడియోలో స్ట్రీట్ వెండర్ రెసిపీకి మరింత రుచిని యాడ్ చేసేందుకు రెండు పదార్థాలతో నూడిల్స్ తయారు చేస్తున్నట్టు కనిపించింది. ఈ రెసిపీలో నిజంగా చెప్పుకోవడానికి అంత గొప్పదనమేం లేకపోవడంతో నెటిజన్లు పలు విమర్శలు చేస్తున్నారు. మ్యాగీకి 400 రూపాయలా.. దీనికి బంగారం కలుపుతున్నారా అనే క్యాప్షన్ తో షేర్ అవుతోన్న ఈ వీడియోపై భిన్న రీతిలో కామెంట్లు వస్తున్నాయి. సాధారణ మ్యాగీ ప్లేట్‌కు ఇంత భారీ మొత్తం చెల్లించే బదులు మరేదైనా కొనుగోలు చేయాలని కొందరు భావించారు. రూ. 400కి 2 ప్లేట్ల మటన్ కర్రీ తీసుకోవచ్చు అని ఇంకొకరు కామెంట్ చేశారు.

https://www.instagram.com/reel/CtTPt-GLXWp/?utm_source=ig_embed&ig_rid=9d59e70b-ed80-4a06-98e6-92f60ff97319