KKR: నరైన్ నవ్వడు, నవ్వలేడు.. అదొక మిరాకిల్: ఆండ్రీ రస్సెల్

KKR: నరైన్ నవ్వడు, నవ్వలేడు.. అదొక మిరాకిల్: ఆండ్రీ రస్సెల్

ఐపీఎల్ 2024 లీగ్ దశ ముగింపు దశకు చేరుకుంది. 70 లీగ్ మ్యాచ్‌లు ముగియగా.. ఇప్పటివరకూ ఏ జట్టు అధికారికంగా ప్లేఆఫ్స్ కు అర్హత సాధించలేదు. నాకౌట్ రేసు నుంచి ఎవరూ వైదొలగలేదు. ఐపీఎల్ టోర్నీలో అత్యంత విజయవంతమైన జట్టు, ఐదుసార్లు ఐపీఎల్ విజేత ముంబై ఇండియన్స్‌ అట్టడుగు స్థానంలో ఉంది. టైటిల్ తమదే అని చెప్పుకున్న బెంగళూరు జట్టు కింద నుండి రెండో స్థానంలో ఉంది. ఇన్నీ అద్భుతాలు జరుగుతున్నా.. ఒక్కటి మాత్రం ఎవరి కంట పడట్లేదు. అదే కోల్‌కతా ఆల్‌రౌండర్.. సునీల్ నరైన్ చిరు నవ్వు.

బౌలింగ్‌తో మాయ చేయగలిగే నరైన్.. బ్యాటింగ్‌లోనూ విశ్వరూపం ప్రదర్శిస్తున్నాడు. క్రీజులో పాతుకుపోయి శివతాండవం ఆడుతున్నాడు. ఎడా పెడా బౌండరీలు బాదుతూ.. ప్రత్యర్థి జట్ల బౌలర్లకు నిద్రలేని రాత్రులు గడిపేలా చేస్తున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటికే ఓ సెంచరీ బాదిన విండీస్ చిచ్చర పిడుగు.. ఆదివారం(మే 06) లక్నోతో జరిగిన మ్యాచ్‌లో మరోసారి భయానక వాతావరణం సృష్టించాడు. ఇంత మంచి ప్రదర్శనలు ఇస్తున్నా.. మైదానంలో అతని మోహంలో ఎటువంటి వ్యక్తీకరణ ఉండటం లేదు. జట్టు ఎటువంటి పరిస్థుతులలో ఉన్నా.. అతను ఒకేలా ఉంటున్నాడు. 

అందుకు గల కారణాలు ఏమిటనే దానిపై కోల్‌కతా యాజమాన్యం ఆ జట్టు సహచర ఆటగాళ్లతో ఒక చిట్ చాట్ జరిపింది. నరైన్ వ్యక్తిత్వం ఎటువంటిది..? నవ్వకపోయాడానికి కారణాలు ఏమిటనే దానిపై, ఫిల్ సాల్ట్, యువ ఆటగాడు అంగ్క్రిష్ రఘువంశీ, విండీస్ సహచరుడు ఆండ్రీ రస్సెల్ ని ప్రశ్నించింది. నరైన్ చిల్ డ్యూడ్ అని సాల్ట్ చెప్పగా.. డ్రెస్సింగ్ రూమ్‌లో నవ్వుతుంటాడని అంగ్క్రిష్ రఘువంశీ వెల్లడించాడు. 

అలసిపోయాడు

నరైన్ గురించి బాగా తెలిసిన అతని సహచరుడు రస్సెల్.. ఈ విషయంలో మాత్రం కాస్త భిన్నంగా స్పందించాడు. 500కి పైగా గేమ్‌లు ఆడి అలసిపోయిన ఒక ఆటగాడు నవ్వుతూ ఉండటం కష్టమని రస్సెల్ తెలిపాడు. నరైన్ నవ్వితే చూడాలని తమకూ ఉంటుందని.. కానీ, అలా జరగడం ఒక మిరాకిల్ అని చెప్పుకొచ్చాడు. ఆఖరికి డ్రెస్సింగ్ రూమ్‌లో జరిగిన బెస్ట్ పెరఫార్మర్ అవార్డు సమయంలోనూ నరైన్ నవ్వకపోవడం గమనార్హం.