Koratala Siva: ఎన్టీఆర్ అభిమానులు కాలర్ ఎగరేసేలా..దేవర ప్రత్యేకంగా నిలుస్తుంది

Koratala Siva: ఎన్టీఆర్ అభిమానులు కాలర్ ఎగరేసేలా..దేవర ప్రత్యేకంగా నిలుస్తుంది

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న దేవర మూవీపై ఆసక్తికర విషయాలు వైరల్ అవుతున్నాయి.సముద్రం బ్యాక్‍డ్రాప్‍లో హైవోల్టేజ్ యాక్షన్ మూవీగా రూపొందుతున్న మూవీ గురించి చిత్ర డైరెక్టర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పలు విశేషాలు పంచుకున్నాడు. 
 
కొరటాల మాట్లాడుతూ..‘ఇటీవల తారక్‌ కూడా దీని గురించి మాట్లాడాడు.అభిమానులు కాలర్ ఎగరేసేలా దేవర ఉంటుందని ఎన్టీఆర్‌ టిల్లు ఈవెంట్ లో చెప్పొకొచ్చిన  విషయాన్ని గుర్తు చేశాడు. ఆయన అభిమానులకు ఈ సినిమా కచ్చితంగా ప్రత్యేకంగా నిలుస్తుంది. ప్రస్తుతానికి ఇంతకు మించి చెప్పలేను.త్వరలోనే అప్‌డేట్స్‌ వస్తాయి’ అన్నారు. దేవర గురించి మాట్లాడడానికి చాలా టైమ్ ఉందని తెలిపారు. 

దీంతో ఎన్టీఆర్‌ బర్త్ డే స్పెషల్ గా (మే20) దేవర నుంచి అదిరిపోయే అప్‌డేట్‌ వచ్చే అవకాశముందని ఫ్యాన్స్‌ భావిస్తున్నారు.ఈ మూవీని యువ సుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలు భారీ బడ్జెట్‍తో సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషనల్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ..హిందీ నార్త్ ఇండియా థియేట్రికల్ హక్కులను కరణ్ జోహార్‌కు చెందిన ధర్మ ప్రొడక్షన్స్,ఏఏ ఫిల్మ్స్ ఇప్పటికే భారీ ధరకు సొంతం చేసుకున్నాయి.

ఇక తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులు కళ్లు చెదిరే ధరకు అమ్ముడవడం ఖాయమే అని టాలీవుడ్ లో చర్చలు మొదలయ్యాయి. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 10న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.