సుమ, ఝాన్సీ క్రేజీ షోస్ వచ్చేశాయ్

సుమ, ఝాన్సీ క్రేజీ షోస్ వచ్చేశాయ్

తెలుగు టీవీ టాప్‌ యాంకర్స్‌ సుమ కనకాల, ఝాన్సీ. ఈ ఇద్దరూ చేస్తున్న రెండు వేరువేరు ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్‌మెంట్‌ అండ్‌ గేమ్‌ షోస్‌ మళ్లీ స్టార్ట్‌‌‌‌ అవుతున్నాయి. ‘స్టార్‌‌‌‌‌‌‌‌ మా’ ఛానెల్‌లో ఝాన్సీ హోస్ట్‌‌‌‌ గా రూపొందిన ‘పరివార్‌‌‌‌‌‌‌‌ లీగ్‌ 2’, సుమ హోస్ట్ ‌‌‌గా రూపొందిన ‘వైఫ్‌ చేతిలో లైఫ్‌’ ఈ వారం నుంచి ప్రసారమవుతున్నాయి. ‘పరివార్ లీగ్‌ 2’ నిన్నటి (సోమవారం) నుంచే టెలికాస్ట్‌‌‌‌ అవుతుండగా, ‘వైఫ్‌ చేతిలో లైఫ్‌’ రేపటి (బుధవారం) నుంచి స్టార్ట్‌‌‌‌ అవుతుంది. ఈ రెండూ ఉదయం పదకొండున్నరకు ప్రసారమవుతాయి. ‘పరివార్‌‌‌‌‌‌‌‌ లీగ్‌ 2’లో సెలబ్రిటీస్‌ పాల్గొంటే, ‘వైఫ్‌ చేతిలో లైఫ్‌’ షోలో కామనర్స్‌ పాల్గొంటారు. ఫ్యామిలీ, మహిళా ఆడియెన్స్‌ టార్గెట్‌గా ఈ షోస్‌ రూపొందాయి. ‘డైలాగ్‌ కింగ్‌’ సాయికుమార్‌‌‌‌‌‌‌‌ హోస్ట్‌‌‌‌ చేస్తున్న మరో షో ‘వావ్‌–3’. ఈటీవీలో ప్రసారమయ్యే ఈ షో ప్రోమో లేటెస్ట్‌‌‌‌గా రిలీజైంది. వచ్చే వారమే ఈ షో స్టార్ట్‌‌‌‌ అయ్యే ఛాన్స్‌ ఉంది.