ఇజ్రాయెల్లో యుద్ద వ్యతిరేక నిరసనలు.. వేలాది మంది వీధుల్లోకి

ఇజ్రాయెల్లో యుద్ద వ్యతిరేక నిరసనలు.. వేలాది మంది వీధుల్లోకి

ఇరాన్​ తో యుద్దం  రెండో నెలకు చేరుకున్న క్రమంలో ఇజ్రాయెల్​ పెద్ద  ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. ఇరాన్​ తో జరుగుతున్న యుద్దాన్ని తక్షనమే నిలిపివేయాలని ఇజ్రాయెల్​ లోని ప్రధాన నగరాలైన టెల్​ అవీవ్​, జెరూసలేం, హైఫాలలో వేలాది మంది ప్రజలు  వీధుల్లోకి వచ్చి నిరసనలు వ్యక్తం చేశారు.  ఫర్​ ఆల్​ ఆఫ్​ అవర్​ లైవ్స్​ అంటూ నినాదాలు చేశారు. యుద్దంతో ప్రాణ ఆస్తినష్టం పెరుగుతోందని, యుద్దానికి వెంటనే ముగింపు పలకాలని డడిమాండ్​ చేశారు. భద్రతాదళాలు నిరసనలను అడ్డుకునేందుకు ప్రయత్నించగా ఆందోళనకారులు,  భద్రతాదళాలకు మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. అనేకమంది నిరసనకారులను అరెస్ట్ చేశారు. 

మాజీ పార్లమెంట్​ సభ్యుల  ఆధ్వర్యంలో ఈ నిరసనలు జరిగాయి. ప్రధాన బెంజిమన్​ నెతన్యాహు అనుసరిస్తూ విధానాలను నిరసిస్తూ  ఈ ఆందోళనలు చేపట్టారు. ప్రభుత్వ చర్యలు ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీస్తున్నాయని ఆందోళనకారులు ఆరోపించారు.  ఇరాన్​ పై యుద్దాన్ని శాశ్వత యుద్దంగా అభివర్ణిస్తూ  వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు.  యుద్ద సమయంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు వ్యవహరిస్తున్న తీరు సరిగ్గా లేదని ఆందోళనకారులు తెలిపినట్లు ఇజ్రాయెల్​ స్థానిక మీడియా రిపోర్టులు వెల్లడించాయి. 

యుద్దానికి ఎక్కువ మద్దతు ఉన్నా ఎందుకీ నిరసనలు..?

 ఓవైపు యూదుల ఇజ్రాయెలీలలో యుద్దానికి బలమైన మద్దతు ఉన్నప్పటికీ తాజా పరిస్థితులలో ప్రజలు వీధుల్లోకి రావడం చర్చనీయాంశమైంది. ఇజ్రాయెల్​ జనాభాలో సుమారు 20 శాతం అరబ్​ మైనార్టీలు యుద్దాన్ని వ్యతిరేకిస్తున్నారు. వారిలో 71శాతం మంది యుద్దాన్ని వ్యతిరేకిస్తుండగా కేవలం 19 శాతంమంది మాత్రమే యుద్దాన్ని సమర్థిస్తున్నారు. 

►ALSO READ | అగ్రరాజ్యంలో ప్రజా గర్జన: ట్రంప్‎కు వ్యతిరేకంగా అమెరికా, ఐరోపాలో భారీ నిరసనలు

యుద్దం ప్రారంభంలో 4శాతంగా ఉన్న యుద్ద వ్యతిరేకత ఇప్పుడు 11.5 శానికి చేరుకుంది. మరోవైపు యుద్దానికి సంపూర్ణ మద్దతు తెలిపే వారి సంఖ్య 74 శాతం నుంచి 50 శాతానికి పడిపోయింది. రోజుల తరబడి కొనసాగుతున్న క్షిపణి దాడుల భయం, ఇజ్రాయెల్ ప్రజలు పడుతున్న ఇబ్బందులు, ఆర్థిక నష్టం పట్ల ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. 
చాలామంది నిరసనకారులు ముఖ్యంగా 55 శాతం మంది అరబ్​ ఇజ్రాయెలీలు బెంజిమన్​ నెతన్యాహు తీరును ఖండిస్తున్నారు. నెతన్యాహు వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాలకోమే యుద్దాన్ని కొనసాగిస్తున్నారని ఆరోపిస్తున్నారు. 

ఇజ్రాయెల్​ లోని స్టాండింగ్​ టుగెదర్​వంటి శాంతిని కోరుకునే సంస్థలు యువత , లెఫ్ట్ వింగ్​ కార్యకర్తలు సుదీర్ఘ యుద్దాలకు స్వస్తి పలకాలని డిమాండ్​ చేస్తున్నారు. దాడులతో శాంతి నెలకొనదని వాదిస్తున్నారు.