ఖాళీ బాటిళ్లను పారేయకండి.. ఈ చిన్న లైట్ తో.. మీ ఇంటిని స్టైలిష్‌గా మార్చేయండి!

 ఖాళీ బాటిళ్లను పారేయకండి.. ఈ చిన్న లైట్ తో.. మీ ఇంటిని స్టైలిష్‌గా మార్చేయండి!

బాటిళ్లతో ఇంటిని డెకరేట్‌‌‌‌ చేయాలి అనుకునేవాళ్లకు ఈ లైట్‌‌‌‌ బాగా ఉపయోగపడుతుంది. వీటిని మెబరాల్ అనే కంపెనీ మార్కెట్‌‌‌‌లోకి తీసుకొచ్చింది. దాదాపు అన్ని రకాల బాటిళ్లకు ఇది సరిపోతుంది. సింపుల్‌‌‌‌గా బాటిల్‌‌‌‌ మూత తీసేసి, దాని స్థానంలో ఈ లైట్‌‌‌‌ని బిగిస్తే సరిపోతుంది. ముఖ్యంగా వైన్ బాటిళ్లను ఇది స్టైలిష్​గా మార్చి, అందరి దృష్టిని ఆకర్షించేలా చేస్తుంది. బాటిళ్లకు కొత్త జీవం పోసినట్టు అనిపిస్తుంది. దీనికి ఉండే బటన్‌‌‌‌ని నొక్కి లైట్‌‌‌‌ని వార్మ్‌‌‌‌, నేచురల్‌‌‌‌, వైట్‌‌‌‌ మోడ్‌‌‌‌లోకి మార్చుకోవచ్చు. 

బటన్‌‌‌‌ని లాంగ్‌‌‌‌ ప్రెస్‌‌‌‌ చేసి, కాంతిని 5 శాతం నుంచి 100 శాతం వరకు సర్దుబాటు చేసుకోవచ్చు. దీన్ని అవుట్‌‌‌‌డోర్ క్యాంపింగ్, ఫ్యామిలీ మీటింగ్స్‌‌‌‌, డిన్నర్ లైటింగ్స్‌‌‌‌లో కూడా వాడుకోవచ్చు. ఇందులో 1800mAh ఇన్‌‌‌‌బిల్ట్‌‌‌‌ రీచార్జబుల్‌‌‌‌ బ్యాటరీ ఉంటుంది. యూఎస్‌‌‌‌బీతో అంటే ల్యాప్‌‌‌‌టాప్‌‌‌‌లు, కంప్యూటర్‌‌‌‌లు, పవర్ బ్యాంక్‌‌‌‌లు, వాల్ అవుట్‌‌‌‌లెట్‌‌‌‌లతో రీచార్జ్‌‌‌‌ చేసుకోవచ్చు. పూర్తిగా చార్జ్ కావడానికి 2.5 గంటలు పడుతుంది. ఒక్కసారి ఫుల్‌‌‌‌ చార్జ్ చేస్తే 12 గంటల వరకు పనిచేస్తుంది. దీన్ని హై క్వాలిటీ మెటీరియల్‌‌‌‌తో తయారుచేశారు. బార్‌‌‌‌లు, కేఫ్‌‌‌‌లు, రెస్టారెంట్లలో పెట్టుకునేందుకు కూడా ఇది అనువైనది. 

►ALSO READ | Non-Vez recipes: చికెన్ గారెలు..  వెరైటీ ఎగ్ స్నాక్స్ .. ఇలా చేస్తే.. టేస్ట్ అదుర్స్..