Non-Vez recipes: చికెన్ గారెలు..  వెరైటీ ఎగ్ స్నాక్స్ .. ఇలా చేస్తే.. టేస్ట్ అదుర్స్..

Non-Vez recipes: చికెన్ గారెలు..  వెరైటీ ఎగ్ స్నాక్స్ .. ఇలా చేస్తే.. టేస్ట్ అదుర్స్..

నాన్​ వెజ్​ తినే ఇండ్లలో చికెన్ ను చిన్న పిల్లల నుంచి పెద్దల ఇష్టంగా తింటారు.అయితే, దీనితో ఒకటి కాదు ఎన్నో రకాల వంటకాలను తయారు చేసుకుని తినొచ్చు. చికెన్ గారెలు ..వెరైటీ ఎగ్​ స్నాక్స్​ను  పిల్లలకు పెడితే వద్దనకుండా లాగించేస్తారు.  మరి ఎంతో టేస్టీగా ఉండే చికెన్​ గారెలు.. డిఫరెంట్​ ఎగ్​ స్నాక్స్​ను సింపుల్​గా ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. . .

చికెన్​ గారెల తయారీకి కావాలసిన పదార్ధాలు

 

  • చికెన్​ : పావుకిలో
  • శనగపప్పు: అరకప్పు
  • పచ్చిమిర్చి: 4
  • అల్లం వెల్లుల్లి పేస్ట్​ : సరిపడ
  • ఉల్లిపాయలు : 4 
  • పసుపు: చిటికెడు
  • ఉప్పు: రుచికి సరిపడ
  • కారం: మూడు టేబుల్​ స్పూన్లు
  • కరివేపాకు, కొత్తిమీర : ఒక్కోటి నాలుగు రెమ్మలు
  • మసాలపొడి : అరటీ స్పూన్​
  • నూనె: వేగించడానికి సరిపడ 

 
చికెన్​ గారెలు తయారీ విధానం

చికెన్​ ను నీళ్లతో శుభ్రం చేయాలి.  ఆ తరువాత దానిలో ఉన్న నీటిని పూర్తిగా తొలగించాలి.  చల్లని ప్రదేశంలో 10 నిమిషాల పాటు పూర్తిగా తడిపోయే వరకు ఆరనివ్వాలి. 

శనగపప్పు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్​ ఈ మూడింటిని మెత్తగా మిక్సీలో గ్రైండ్​ చేయాలి. ఇది కీమాలాగా మెత్తగా ఉండాలి. 

తరువాత కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, కారం, మసాలా,  సన్నగా తరిగిన ఉల్లిపాయలు  పైన తెలిపిన కీమాలో బాగా కలిసేలా కలపాలి. 
ఆ తరువాత స్టవ్​ వెలిగించి పాన్​ లో నూనెను వేడి చేయాలి.  ఇప్పుడు చేతులకు నూనె రాసుకొని మినప గారెల్లా కీమా పిండిని కావలసినంత పల్చగా చేసి.. నూనెలో రెండు వైపులా బాగా వేగనివ్వాలి.  ఆ తరువాత వీటిని  చిల్లుల గరిటెతో తీసి.. నూనె మొత్తం పోయేలా ఉంచి ఒక ప్లేట్​ లోకి తీసుకోవాలి.  అంతే చాలా సింపుల్​ గా వేడి వేడి గారెలు రడీ..

ఎగ్ స్నాక్ తయారీకి కావాల్సినవి 

  • నూనె : ఒకటిన్నర టేబుల్ స్పూన్
  • మైదా, పాలు : ఒక్కో కప్పు
  • కోడిగుడ్లు : ఐదు
  • ఉల్లిగడ్డలు : రెండు
  • కారం, చికెన్ మసాలా, టొమాటో కెచెప్:ఒక్కో టీస్పూన్ చొప్పున
  •  అల్లం, వెల్లుల్లి తరుగు, నీళ్లు : ఒక్కో టీస్పూన్ చొప్పున
  • టొమాటో, క్యాప్సికమ్ : ఒక్కోటి
  • పచ్చిమిర్చి : రెండు
  • ధనియాల పొడి : అర టీస్పూన్
  • పసుపు : పావు టీస్పూన్
  • ఉప్పు : సరిపడా

ఎగ్ స్నాక్స్​ తయారీ విధానం

 నాలుగు కోడిగుడ్లను ఉడకపెట్టి, పొట్టు తీయాలి. తరువాత వాటిని నిలువుగా కట్ చేయాలి. పాన్​లో టీస్పూన్ నూనె, చిటికెడు పసుపు, కారం, ఉప్పు వేసి కలపాలి. 

తర్వాత ఉడికించిన కోడిగుడ్లను అందులో   వేగించాలి. మరో పాన్​లో నూనె వేసి అల్లం– వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ తరుగు, ఉప్పు వేసి వేగించాలి. తర్వాత క్యాప్సికమ్, టొమాటో తరుగు కూడా వేయాలి. 

అవి వేగాక అందులో కారం, పసుపు, చికెన్ మసాలా, ధనియాల పొడి వేసి వేగించాలి. అందులో నీళ్లు పోసి కలపాలి. ఆ తర్వాత టొమాటో కెచెప్, కొత్తిమీర వేసి కలపాలి.  

మిక్సీజార్​లో మైదా, ఒక గుడ్డు సొన వేసి అర కప్పు పాలు పోసి బ్లెండ్​ చేయాలి. తర్వాత మిగతా పాలు పోసి, ఉప్పు, నూనె వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలో పోయాలి. 

ఒక పాన్​లో మొత్తం నూనె రాసి అందులో ఈ మిశ్రమాన్ని గరిటెతో దోశలా పోయాలి. సన్న మంట మీద రెండు వైపులా కాల్చాలి. ఆ తర్వాత దాన్ని ఒక ప్లేట్​లో పెట్టి అందులో రెడీ చేసిన స్టఫింగ్, కోడిగుడ్డు కూడా​ పెట్టాలి.

 మైదా పిండిలో నీళ్లు కలిపి ఆ మిశ్రమాన్ని చివర్లకు రాసి నాలుగు వైపులా మడతపెట్టాలి. వాటిని వేడి నూనెలో రెండు వైపులా వేగిస్తే టేస్టీగా ఉండే వెరైటీ ఎగ్ స్నాక్స్​ రెడీ.