IPL 2026 : ముంబై ఇండియన్స్కు బిగ్ షాక్.. కేకేఆర్తో మ్యాచ్కి స్టార్ ప్లేయర్స్ ఔట్!

IPL 2026 : ముంబై ఇండియన్స్కు బిగ్ షాక్.. కేకేఆర్తో మ్యాచ్కి స్టార్ ప్లేయర్స్ ఔట్!

Mumbai Indians: ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభంలోనే ముంబై ఇండియన్స్ జట్టుకి బిగ్ షాక్ తగిలింది. రేపు (2026, మార్చి 29న) కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుతో జరగనున్న తొలి పోరుకి ముందు ముగ్గురు కీలక ఆటగాళ్లు అందుబాటులో ఉండకపోవచ్చని తెలుస్తోంది. వాంఖెడేలో సీజన్‌ను ఘనంగా ప్రారంభించాలనుకుంటున్న ముంబైకి, ఈ కీలక ఆటగాళ్ల గైర్హాజరీ పెను సవాల్ గా మారింది. బౌలింగ్ అండ్ బ్యాటింగ్ విభాగాల్లో మార్పులు చేసి కేకేఆర్ జట్టును ముంబై ఇండియన్స్ టీమ్ ఎలా ఎదుర్కొంటుందో వేచి చూడాలి.

మిచెల్ సాంట్నర్: న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్, ఇటీవలే దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్ ముగిసిన తర్వాత అతను ఇంకా జట్టుతో చేరాల్సి ఉంది. మిడిల్ ఓవర్లలో పరుగులు కంట్రోల్ ఇవ్వడంలో అతను కీలక పాత్ర పోషించనున్నాడు. కాగా  టీ20 వరల్డ్ కప్‌లో 8 మ్యాచ్‌ల్లో 140 స్ట్రైక్ రేట్‌తో 120 పరుగులు చేయడమే కాకుండా, బంతితోనూ మెప్పించాడు.

విల్ జాక్స్: వ్యక్తిగత కారణాల వల్ల ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ విల్ జాక్స్ అందుబాటుపై లేడని తెలుస్తుంది. టీ20 వరల్డ్ కప్‌లో సెమీఫైనల్ వరకు వెళ్లిన ఇంగ్లాండ్ జట్టులో అతను కీలక పాత్ర పోషించాడు. ఇక టీ20 వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ తరపున అద్భుతంగా ఆడి, 9 వికెట్లు తీయడమే కాకుండా 4 సార్లు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డులను గెలుచుకున్నాడు.

►ALSO READ | SRHvs RCB: మొదటి మ్యాచులోనే టఫ్ ఫైట్.. వాతావరణ సూచనలు, పిచ్ రిపోర్ట్పై బిగ్ అప్డేట్

జస్ప్రీత్ బుమ్రా: వాంఖెడే స్టేడియంలో జరిగిన ప్రాక్టీస్ సెషన్‌కు బుమ్రా కూడా హాజరుకాకపోవడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. దీంతో అతడు రేపటి కేకేఆర్ తో జరిగే మ్యాచ్ ఆడేది అనుమానంగా మారింది. 

ప్రత్యామ్నాయ ప్లేయర్స్ ఎవరు?: 

అల్లా ఘజన్ఫర్: సాంట్నర్ స్థానంలో ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన ఈ యువ స్పిన్నర్‌ను ఆడించే అవకాశం ఉంది. సాంట్నర్ లాగే ఇతను కూడా బంతితో బ్యాటర్లను నియంత్రణ చేస్తాడు.

షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ : విల్ జాక్స్ స్థానంలో పవర్ హిట్టింగ్ ఆల్‌రౌండర్ రూథర్‌ఫోర్డ్‌ను లోయర్ మిడిల్ ఆర్డర్‌లో ఉపయోగించుకోవచ్చు. ఇతను గతంలో గుజరాత్ టైటాన్స్ తరపున ఆడాడు.