రైల్ రోకో కేసులో కవితకు సమన్లు... సికింద్రాబాద్ రైల్వే కోర్టుకు హాజరు కావాలని ఆదేశాలు...

రైల్ రోకో కేసులో కవితకు సమన్లు... సికింద్రాబాద్ రైల్వే కోర్టుకు హాజరు కావాలని ఆదేశాలు...

రైల్ రోకో కేసులో టీఆర్ఎస్ చీఫ్ కవితకు సమన్లు జారీ చేసింది సికింద్రాబాద్ రైల్వే కోర్టు. బుధవారం ( మే 13 ) ఉదయం 10:30 గంటలకు కోర్టుకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది సికింద్రాబాద్ రైల్వే కోర్టు. గతంలో కవిత బీసీలకు 42శాతం రిజర్వేషన్ల డిమాండ్‌తో కామారెడ్డిలో రైల్ రోకో చేసిన క్రమంలో సమన్లు జారీ చేసింది కోర్టు.

కవితతో పాటు మరో 12 మంది టీఆర్ఎస్ నాయకులపై కేసులు నమోదయ్యాయి. రైల్వే యాక్ట్ 147 & 74(a) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం. రైల్ రోకోలో భాగంగా దేవగిరి ఎక్స్‌ప్రెస్‌ తో పాటు గూడ్స్ రైలు నిలిపేశారు కవిత. దీంతో నిజామాబాద్–హైదరాబాద్ రూట్‌లో అంతరాయం ఏర్పడింది. రైల్వే ఏఎస్ఐ రవీంద్రబాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు.

అయితే.. ఈ కేసు విచారణలో భాగంగా సికింద్రాబాద్ కోర్టుకు కవిత హాజరవుతారా లేదా అన్నది ఉత్కంఠగా మారింది. ఈ కేసుకు సంబంధించి విచారణ సందర్భంగా కోర్టు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. బీసీ రిజర్వేషన్ల అంశం తెలంగాణ పాలిటిక్స్ లో కీలకంగా మారిన క్రమంలో ఈ కేసు ప్రాధాన్యత సంతరించుకుంది.