సూపర్ మార్కెట్స్, కిరాణా షాపుల్లో సరుకులు ఖాళీ

సూపర్ మార్కెట్స్, కిరాణా షాపుల్లో సరుకులు ఖాళీ

హైదరాబాద్, వెలుగుగ్రేటర్​లోని సూపర్ మార్కెట్స్, కిరాణా షాపుల్లో సరుకులు ఖాళీ అవుతున్నాయి. లాక్ డౌన్ నేపథ్యంలో కొందరు ఎక్కువ రోజులకు సరిపడా నిత్యావసరాలు, ఇతర సామగ్రిని కొనేయడంతో పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లలోనూ నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. నిత్యావసరాల లిస్ట్ తో వెళ్తే సగం సరుకులే దొరుకుతున్నాయి. గ్రోసరీకి ఇబ్బంది లేకుండా చూస్తామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ కొందరు వీలైనంత ఎక్కువ కొనుగోలు చేస్తున్నారు. దాంతో ఇతరులకు ఆ సరుకులు దొరకడం లేదని నిర్వాహకులు చెబుతున్నారు. హోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సేల్ మార్కెట్లు, దుకాణాల్లో స్టాక్ వేగంగా అయిపోతుండగా, తిరిగి తెప్పిద్దామంటే ట్రాన్స్ పోర్ట్ ప్రాబ్లమ్ ఉందని చెప్తున్నారు. ఈ పరిస్థితిని అవకాశంగా తీసుకుని కొన్ని సూపర్​ మార్కెట్లు కస్టమర్లకు ఇచ్చే డిస్కౌంట్లు కూడా తగ్గించాయి. మరోవైపు బీపీ, షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు ఒకేసారి 3 నెలలకు సరిపడా ట్యాబ్లెట్స్ కొంటున్నారు. దాంతో మెడికల్ షాపుల్లో మందుల కొరత ఏర్పడుతోంది. సిటీలో 2వేలకు పైగా మెడికల్ షాపులు ఉండగా, ఎక్కడా అన్ని రకాలు మందులు అందుబాటులో ఉండటం లేదు. హాస్పిటల్ కి అటాచ్​అయి ఉన్న వాటిలో మాత్రమే పూర్తిస్థాయిలో మెడిసిన్ దొరుకుతోంది.

సగానికిపైగా పడిపోయిన బిజినెస్​

హైదరాబాద్​లో దాదాపు 250 సూపర్​ మార్కెట్లున్నాయి. బేగంబజార్ లో ఉన్న హోల్ సేల్ షాపులు 200కి పైనే.  అవికాకుండా చిన్నాపెద్ద హోల్​సేల్, రిటైల్​దుకాణాలు 5 వేలకు మించి ఉన్నాయి. లాక్​డౌన్​ కారణంగా మొదట్లో బేగంబజార్​లోని అన్ని షాపులు మూసేశారు. నిత్యావసర వస్తువుల కోసం జనం ఇబ్బందులు పడకూడదని ప్రభుత్వం వాటికి కండీషన్స్​తో కూడిన పర్మిషన్​ ఇచ్చింది. అయినా అంతగా గిరాకీ లేదని ఓనర్లు చెబుతున్నారు. సాధారణ రోజుల్లో ఒక్కో హోల్​సేల్​ దుకాణంలో రూ.25లక్షల నుంచి40 లక్షల బిజినెస్ ఉండేదని.. ఇప్పుడు రూ.10 లక్షలు కూడా దాటడం లేదని ఆవేదన చెందుతున్నారు. షాప్​లో అన్ని రకాల వస్తువుల ఉంటే ఆ మాత్రం నడుస్తున్నాయని వాపోతున్నారు. సూపర్ మార్కెట్లలోనూ 60 శాతం గిరాకీ తగ్గినట్టు స్టోర్ ఓనర్లు చెబుతున్నారు. కొన్ని రిటైల్​ దుకాణాలు స్టాక్ లేక
మూతపడ్డాయి.

పాత పద్దతులతో కరోనా దూరం