AkhilZainabReception: అఖిల్ రిసెప్షన్లో మహేష్ ఫ్యామిలీ సందడి.. ఇంకెవరెవరు వచ్చారంటే..

AkhilZainabReception: అఖిల్ రిసెప్షన్లో మహేష్ ఫ్యామిలీ సందడి.. ఇంకెవరెవరు వచ్చారంటే..

అక్కినేని అఖిల్, జైనాబ్ వివాహ రిసెప్షన్ వేడుక ఘనంగా జరుగుతోంది. కృష్ణానగర్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో జరుగుతున్న ఈ వేడుకకు మహేష్ బాబు సతీసమేతంగా హాజరయ్యాడు. సితార కూడా ఈ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. అఖిల్ అక్కినేని తన బ్యాచిలర్ లైఫ్‌‌‌‌‌‌‌‌కు గుడ్ బై చెప్పి.. వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.

శుక్రవారం తెల్లవారుజామున తన ప్రియరాలు జైనబ్‌‌‌‌‌‌‌‌ రవ్‌‌‌‌‌‌‌‌డ్జీతో అఖిల్ ఏడడుగులు వేశాడు. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో అంగరంగ వైభవంగా జరిగిన వీరి వివాహ వేడుకకు చిరంజీవి దంపతులు, రామ్ చరణ్ దంపతులు, శర్వానంద్, రాజమౌళి కొడుకు కార్తికేయ, డైరెక్టర్ ప్రశాంత్ నీల్, హీరో సుమంత్  సహా పలువురు సినీ సెలబ్రిటీస్  హజరై సందడి చేశారు.

పెళ్లి అనంతరం జరిగిన బరాత్లో నాగార్జున, నాగ చైతన్య, అఖిల్ కలిసి డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. పరిమిత సంఖ్యలో హాజరైన అతిథుల సమక్షంలో పెళ్లి సింపుల్గా జరిగినప్పటికీ రిసెప్షన్ను మాత్రం అక్కినేని ఫ్యామిలీ గ్రాండ్గా ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా ఈ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. 

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబును కూడా నాగార్జున ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఈ రిసెప్షన్కు తమిళ నటుడు సూర్య కూడా హాజరయి నూతన వధూవరులకు శుభాకాంక్షలు చెప్పాడు. అక్కినేని ఫ్యామిలీ మొత్తం కలిసి దిగిన ఫొటో నెట్టింట వైరల్ అయింది. 2024 నవంబర్లో అఖిల్, జైనబ్‌‌‌‌‌‌‌‌ రవ్‌‌‌‌‌‌‌‌డ్జీ నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. 2025, జూన్ 6న వివాహ బంధంలోకి ఈ జంట అడుగుపెట్టింది.

అఖిల్ ప్రస్తుతం ‘‘వినరో భాగ్యము విష్ణు కథ’’ మూవీ డైరెక్టర్ మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వం వహిస్తున్న ‘లెనిన్’ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా రాయలసీమలోని ఓ పల్లెటూరిలో జరిగిన రియల్ లైఫ్ ఇన్సిడెంట్ ఆధారంగా తెరకెక్కుతున్నట్లు సమాచారం. ఈ సినిమాని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్పై నిర్మిస్తున్నారు.