ప్రభుత్వం కార్పొరేట్ స్కూళ్లు చెప్పినట్లు వింటుంది

 ప్రభుత్వం కార్పొరేట్ స్కూళ్లు చెప్పినట్లు వింటుంది

స్కూల్స్ తెరవడానికి కరోనా అడ్డురాలేదు కానీ.. హుజురాబాద్ ఎన్నికల అనగానే ప్రభుత్వానికి కరోనా నిబంధనలు గుర్తుకొచ్చాయన్నారు సూర్యాపేట ZP CEO ప్రేమ్ కరణ్ రెడ్డి. తెలంగాణ ప్రభుత్వం కార్పోరేట్ స్కూళ్లు చెప్పినట్లు వింటుందన్నారు. తెలంగాణలో కార్పొరేట్ స్కూల్స్ కు ఉన్న ప్రాధాన్యత ప్రభుత్వ పాఠశాలలకు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. స్కూళ్లు తెరిస్తే డబ్బులు ఖర్చవుతాయన్న ఆలోచనలో ఉండటం దారుణమన్నారు. ఆదివారం సూర్యాపేట సిద్ధార్థ హైస్కూల్ లో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమంలో మాట్లాడారు ప్రేమ్ కరణ్ రెడ్డి. విద్యారంగాన్ని మార్చేందుకు అవసరమైతే తన పదవికి రాజీనామా చేయడానికి సిద్దంగా ఉన్నానని చెప్పారాయన.