టీటీకె ప్రెస్టిజ్‌ నుంచి స్వచ్ఛ్‌ గ్యాస్‌ స్టవ్‌

టీటీకె ప్రెస్టిజ్‌ నుంచి స్వచ్ఛ్‌ గ్యాస్‌ స్టవ్‌

హైదరాబాద్: అత్యంత సులభంగా శుభ్రపరుచుకునే డిజైన్‌ కలిగిన స్వచ్ఛ్‌ గ్యాస్‌ స్టవ్‌ టీటీకె ప్రెస్టిజ్‌ విడుదల చేసింది. పైకి లేపగలిగిన బర్నర్‌ సెట్‌ మరియు డ్రిప్‌ ఫ్రీ డిజైన్‌ కిచెన్‌ ప్లాట్‌ఫార్మ్‌పై ఆహార వ్యర్థాలు ఏమీ వెదజల్లకుండా కాపాడుతుంది. జంబో బ్రాస్‌ బర్నర్స్‌ వేగవంతమైన కుకింగ్‌కు  భరోసా అందించడంతో పాటుగా ఎల్‌పీజీ వినియోగం పరంగా మెరుగైన సామర్థ్యమూ అందిస్తుందని సంస్థ చెబుతోంది. అలాగే వంట చేసేటప్పుడు  స్టవ్‌పై చిందిన ఆహార వ్యర్థాలను సేకరించే డ్రిప్‌ ట్రే దీనికి జత చేయడంతో స్టవ్ శుభ్రం చేసుకునే సమయం తగ్గిపోతుంది.  
పేటెంట్‌ దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది, డిజైన్‌ నమోదు ప్రక్రియ పూర్తయిందని సంస్థ ప్రకటించింది. ఈ గ్యాస్‌ స్టవ్‌లను టీటీకె ప్రెస్టిజ్‌ హోసూర్‌ ఫ్యాక్టరీలో తయారుచేస్తున్నారు. ఈ ఆవిష్కరణ గురించి టీటీకె ప్రెస్టిజ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌  చంద్రు కల్రో మాట్లాడుతూ గ్యాస్‌ స్టవ్‌లలో ఈ తరహా వినూత్న ఆవిష్కరణలు దశాబ్దాలుగా ఎవరూ చూడలేదన్నారు. వంటింటి ఇబ్బందులను తీర్చడంతో పాటుగా క్లీనింగ్‌లో ఎదురవుతున్న సమస్యలను తీర్చే ఈ నూతన గ్యాస్‌ స్టవ్‌ను వినియోగదారులు ఆదరిస్తారనే నమ్మకంతో ఉన్నామని అన్నారు.