తాజ్ మహల్ కు నోటీసులు.. తప్పంటున్నహెరిటేజ్ అధికారులు

తాజ్ మహల్ కు నోటీసులు.. తప్పంటున్నహెరిటేజ్ అధికారులు

ప్రపంచ ప్రసిద్ధి కట్టడాల్లో ‘తాజ్ మహల్’ ఒకటి. ప్రేమకు చిహ్నంగా పిలవబడే ఈ తాజ్ మహల్. యమునా నది ఒడ్డున ఉంది. దీనిని చూడటానికి దేశ, విదేశాల నుంచి ఎంతో మంది ఇక్కడకు విచ్చేస్తుంటారు. అలాంటి చారిత్రత్మక కట్టడమైన తాజ్ మహాల్ కు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాకు నోటీసులు జారీ చేశారు. ఆస్తి, నీటి పన్ను బకాయిలు ఉన్నట్లు నోటీసులు ఇచ్చారు. లక్షా 40 వేల ఆస్తి పన్ను, కోటి రూపాయల నీటి పన్ను పెండింగ్ ఉన్నట్లు నోటీసులో వెల్లడించారు.

పెండింగ్ లో ఉన్న ట్యాక్స్ లను పే చేయాలని నోటీసులో తెలిపారు. పెండింగ్ ట్యాక్స్ చెల్లించేందుకు 15 రోజుల గడువు ఇచ్చారు. మున్సిపల్ అధికారులు జారీ చేసిన నోటీసును చూసి ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు నోరెళ్లబెట్టారు. తాజ్ మహాల్ జాతీయ స్మారక చిహ్నమని...ఎలాంటి ట్యాక్స్ విధించడానికి వీల్లేదంటున్నారు ASI అధికారులు. ఈ వ్యవహారంపై ఏఎస్‌ఐ సూపరింటెండెంట్‌ రాజ్‌కుమార్‌ పటేల్‌ స్పందించారు. ఈ వ్యవహారంలో కార్పొరేషన్‌ అధికారులు పొరపాటు పడ్డారని, ఎటువంటి స్మారక చిహ్నాలకు పన్ను విధించటం జరగదని చెప్పారు.