తమిళనాడులో మరో విడత కేబినె సీఎం విజయ్ కేబినెట్ లో మరో ఇద్దరికి చోటు దక్కింది. VCK,IUML పార్టీలకు చెరొక మంత్రి పదవి కేటాయించారు. దీంతో తమిళనాడు కేబినెట్ లో మంత్రుల సంఖ్య 35కు చేరింది. సీఎం గా విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన రోజు 9మంది, మే21న 23మంది ఇప్పటికే ప్రమాణ స్వీకారం చేశారు.
తొలుత బయటినుంచి మద్దతు ఇచ్చిన విదుతలై చిరుతైగల్ కచ్చి(VCK), ఇం డియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) .. ఇప్పుడు అధికారికంగా విజయ్ కూటమిలో చేరాయి. పాపనాశం అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి గెలిచిన ఐయూఎంల్ పార్టీ ఎమ్మెల్యే షాజహాన్, తిండివనం నుంచి ఎన్నికైన వీసీకే ఎమ్మెల్యే వన్ని అరసు మే 22న శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు.
