అఖిలపక్ష సమావేశానికి బీజేపీ, అన్నాడీఎంకే డుమ్మా

అఖిలపక్ష సమావేశానికి బీజేపీ, అన్నాడీఎంకే డుమ్మా

మెడికల్ ఎంట్రన్స్ కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్టు నీట్ కు వ్యతిరేకంగా తమిళనాడు సీఎం స్టాలిన్ ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించారు. బీజేపీ, అన్నా డీఎంకే అఖిలపక్ష సమావేశాన్ని బహిష్కరించారు. నీట్ కు వ్యతిరేకంగా బిల్లు పంపే ముందే గవర్నర్ ను కలిశానన్నారు స్టాలిన్. 11 కొత్త మెడికల్ కాలేజీలు ప్రారంభించినప్పుడు వర్చువల్ మీటింగ్ లో ప్రధానిని కోరానన్నారు. నీట్ పరీక్ష నుంచి మినహాయింపు ఇవ్వాలని 8 కోట్ల మంది ప్రజల డిమాండ్ ను అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదించామన్నారు. మీ విలువైన అభిప్రాయాలు తెలపాలని అఖిలపక్ష సమావేశంలో నాయకులతో అన్నారు స్టాలిన్. గతేడాది సెప్టెంబర్ 13న బిల్లును తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్.రవికి పంపింది డీఎంకే ప్రభుత్వం. 143 రోజుల తర్వాత ఈనెల 1న తమిళనాడు గవర్నర్ బిల్లుని వెనక్కి పంపారు. విద్యార్థుల ప్రయోజనాలకు విరుద్ధమని భావిస్తున్నట్లు తమిళనాడు గవర్నర్ తెలిపారు. 

మరిన్ని వార్తల కోసం

క్లీన్ ట్రాక్ రికార్డ్ ఉన్నవారినే ఎంపిక చేయండి

యూపీలో కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్స్ వీళ్లే