క్లీన్ ట్రాక్ రికార్డ్ ఉన్నవారినే ఎంపిక చేయండి

క్లీన్ ట్రాక్ రికార్డ్ ఉన్నవారినే ఎంపిక చేయండి

పంజాబ్ కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పంజాబ్ కాంగ్రెస్ లో సీఎం అభ్యర్థిని కాంగ్రెస్  నాయకుడు రాహుల్‌ గాంధీ రేపు అధికారికంగా ప్రకటించనున్నారు. చరణ్ జిత్ సింగ్ చన్నీ, నవజ్యోత్ సిద్ధూ ఇద్దరూ ముఖ్యమంత్రి అభ్యర్థి కోసం పోటీ పడుతున్నారు. అయితే  పంజాబ్‌లోని కాంగ్రెస్  ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఒకరి పేరును మాత్రమే ప్రకటిస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో రాహుల్‌​గాందీ లూథీయానాలో ఈ ఇద్దర్ని పంజాబ్‌ ముఖ్యమంత్రులుగా ప్రకటిస్తున్నారంటూ ప్రచారం ఊపందుకుంది.

చన్నీపై సిద్ధూ విమర్శలు

ఇలాంటి ప్రచారం జరుగుతున్న మరుసటి రోజే అక్రమ ఇసుక తవ్వకాల కేసులో చన్నీ మేనల్లుడు భూపేంద్ర సింగ్ హనీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసింది. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎక్కువ మంది ఎమ్మెల్యేల మద్దతుతో ముందంజలో ఉన్నారు చన్నీ. కాంగ్రెస్ హైకమాండ్ కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిగా చన్నీనే ప్రకటిస్తామని సంకేతాలు ఇచ్చింది. ఐవీఆర్ కాల్స్ ద్వారా నిర్వహించిన సర్వేలో చన్నీకే ఎక్కువ మంది మద్దతు లభించింది. ఇక అంతే ఒక్కసారిగా  తన సొంత పార్టీపై దాడిని పెంచారు సిద్ధూ. మరోవైపు చన్నీ మేనల్లుడు అరెస్టు కావడంతో ప్రత్యక్ష విమర్శలకు దిగారు. ఈ మేరకు సిద్దూ పార్టీ నిజాయితీ, క్లీన్ ట్రాక్ రికార్డ్ ఉన్న వారిని ఎన్నుకోవాలంటూ పిలుపునిచ్చారు. మాఫియాతో ప్రమేయమున్న వ్యక్తిని ముఖ్యమంత్రిగా ఎన్నుకోరని.. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పారు. 

మరిన్ని వార్తల కోసం

హిమాచల్ ప్రదేశ్‌లో భారీ హిమపాతం

పూణెలో ఫూల్ డే స్కూల్స్