పూణెలో ఫుల్ డే స్కూల్స్

పూణెలో ఫుల్ డే స్కూల్స్

సోమవారం నుంచి అన్ని పాఠశాలలు తెరుచుకుంటాయని మహారాష్ట్ర సర్కార్ ప్రకటించింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తెలిపారు. పూణె జిల్లాలోని అన్ని తరగతుల్ని ఫిబ్రవరి 7 సోమవారం నుంచి పూర్తి రోజు తెరిచేందుకు అనుమతి కల్పిస్తున్నామన్నారు అజిత్ పవార్. కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా విద్యా సంస్థలకు పలు నిబంధనలు పెట్టారు. స్కూల్స్‌ను ఫుల్ డే కాకుండా ఆఫ్ డే వరకే కొనసాగిస్తున్నారు. స్కూళ్లకు రానివిద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. అయితే తాజాగా స్కూల్స్‌ను పూర్తిగా తెరిచేందుకు అనుమతి కల్పిస్తున్నామన్నారు. సోమవారం నుంచి స్కూల్స్ పూర్తిగా రెండు పూటలా నిర్వహించేందుకు మహా సర్కార్ అనుమతి ఇచ్చింది. 

ఇవి కూడా చదవండి:

నామినేషన్ కోసం మంత్రి ఉపేంద్ర తివారీ పరుగులు