హిమాచల్ ప్రదేశ్‌లో భారీ హిమపాతం

హిమాచల్ ప్రదేశ్‌లో భారీ హిమపాతం

హిమాచల్ ప్రదేశ్‌లో భారీగా మంచు కురుస్తోంది. సిమ్లా,చాంబా,కులు,స్పితి జిల్లాలో మంచు కురుస్తోంది. తెల్లటి మంచు దుప్పటితో ఆయా ప్రాంతాలన్నీ కప్పేశాయి. హిమపాతంతో ఆయా ప్రాంతాల్లో టెంపరేచర్లు పడిపోయాయి. ఈ క్రమంలో హిమాచల్‌కు వచ్చే పర్యాటకులు మంచులో ఆడుతూ ఆనందం వ్యక్తంచేస్తున్నారు. మరోవైపు రానున్న 48 గంటల్లో హిమాచల్ ప్రదేశ్‌లో భారీ హిమపాతం నమోదయ్యే అవకాశం ఉందని  భారత వాతావరణ శాఖ (IMD) కార్యాలయ డైరెక్టర్ సురేందర్ పాల్ తెలిపారు. హిమాచల్ ప్రదేశ్‌లోని చంబా, స్పితి, కులు మరియు సిమ్లాతో సహా ఎత్తైన ప్రాంతాలలో భారీ మంచు కురుస్తుందని వాతావరణ శాఖ పేర్కొంది. ఆయా ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశామన్నారు. 

ఇవి కూడా చదవండి: 

నీరు లేదు.. రోడ్డు లేదు.. బిందెలతో కిలోమీటర్ల నడక

రోడ్డును చేత్తో తవ్వేస్తున్నారు