యూపీలో కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్స్ వీళ్లే

యూపీలో కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్స్ వీళ్లే

ఉత్తర్ ప్రదేశ్‌లో ఎన్నికల సందడి నెలకొంది. పార్టీలన్నీ ప్రచారంలో బిజీగా మారాయి. ఎవరికి వారు అధికారం కోసం వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నారు. అధికార పార్టీ బీజేపీ, ప్రతిపక్ష పార్టీ ఎస్పీ, కాంగ్రెస్ నాయకులు తాజాగా ఎన్నికల ప్రచారంపై ఫోకస్ పెట్టారు. ఎవరికి వారు ప్లాన్‌లు వేసుకుంటూ దూసుకుపోతున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ మూడో విడతలో పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేసే స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసింది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, గులాం నబీ ఆజాద్, అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్, మహ్మద్ అజారుద్దీన్ తదితరులు యూపీ ఎన్నికల ప్రచారంలో ఉన్నారు.

ఉత్తరప్రదేశ్‌లో మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడతల ఎన్నికలు ఈ నెల 10న జరుగుతాయి. మార్చి 10న ఓట్లు లెక్కిస్తారు. 2017 ఎన్నికల్లోనూ యూపీలో ఏడు దశల్లో ఎన్నికలు జరిగాయి. మొత్తం 410 సీట్లకు గాను భారతీయ జనతా పార్టీ, దాని మిత్ర పక్షాలు 312 సీట్లు గెలుచుకున్నాయి. ఈసారి ఎన్నికల్లో బీజేపీ, అఖిలేశ్ యాదవ్ సారథ్యంలో సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్, మాయావతి బహుజన్ సమాజ్ పార్టీ పోటీకి దిగుతున్నాయి.