నేషనల్ పెన్షన్ సిస్టమ్ ట్రస్ట్ (ఎన్పీఎస్ ట్రస్ట్) స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం ఖాళీలు: 15.
విభాగాల వారీగా ఖాళీలు: ఎగ్జిక్యూటివ్ 4, సీనియర్ ఎగ్జిక్యూటివ్ 5, అనలిస్ట్ 2, సీనియర్ అనలిస్ట్ 4.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్/ పోస్ట్ గ్రాడ్యుయేషన్/ బి.టెక్ / ఎంసీఏ/ ఎంబీఏ/ సీఏ/ సీఎఫ్ఏ/ ఎఫ్ఆర్ఎం/ లా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. పని అనుభవం తప్పనిసరి.
గరిష్ట వయోపరిమితి: 40 ఏళ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
లాస్ట్ డేట్: ఏప్రిల్ 29.
సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ npstrust.org.inను సందర్శించండి.
