పాస్టర్ కూతురితో ప్రేమలో పడే హీరో.. కథలో ఊహించని మలుపు.. ‘హాళ్’ సినిమా ఎలా ఉందంటే..

పాస్టర్ కూతురితో ప్రేమలో పడే హీరో.. కథలో ఊహించని మలుపు.. ‘హాళ్’ సినిమా ఎలా ఉందంటే..
  • పెళ్లిలో పుట్టిన ప్రేమ!
  • టైటిల్: హాళ్
  • ప్లాట్‌‌ఫాం: సన్‌‌నెక్ట్స్‌‌, మనోరమా మ్యాక్స్
  • డైరెక్షన్: వీరా
  • కాస్ట్: షేన్ నిగమ్​, సాక్షి వైద్య, జానీ ఆంటోని, జాయ్ మాథ్యూ

ఆసిఫ్ బీరన్ (షేన్ నిగమ్​)కు చదువు మీద పెద్దగా ఇంట్రస్ట్‌‌ ఉండదు. దాంతో ర్యాపర్‌‌‌‌గా ఎదగాలని కలలు కంటుంటాడు. ‘అజ్బీ అండ్ మోంజన్స్’ పేరుతో ఒక బ్యాండ్ కూడా నడుపుతుంటాడు. ఒకసారి పెళ్లిలో పాటలు పాడేందుకు వెళ్లి అక్కడ ఒక పాస్టర్ కూతురు మరియా ఫెర్నాండెజ్ (సాక్షి వైద్య)ని చూసి ప్రేమలో పడతాడు. మరియా ఇంజనీరింగ్ స్టూడెంట్‌‌ అని తెలుసుకుని ఆమె కోసం సిటీ మొత్తం గాలిస్తాడు. చివరకు వాళ్లిద్దరూ కలుసుకుంటారు. వాళ్ల మధ్య బలమైన బంధం ఏర్పడుతుంది. 

మరియాకు తన ప్రేమ విషయం చెప్పాలి అనుకుంటాడు. అప్పుడే ఆమెకు అప్పటికే అమెరికాలో ఉండే మరో వ్యక్తితో పెళ్లి నిశ్చయమైందని తెలుసుకుంటాడు ఆసిఫ్​. పైగా ఇద్దరివి వేరు వేరు మతాలు కావడంతో చాలా సమస్యలు ఎదురవుతాయి. ఆ తర్వాత ఏం జరిగింది? వారి ప్రేమ గెలిచిందా? లేదా? తెలియాలంటే సినిమా చూడాలి.

►ALSO READ | ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమాకు ఫుల్ పాజిటివ్ రివ్యూస్.. సినిమా పేరు తో తి అని ఫుజి.. టైటిల్ ఒక్కటే కాదు కథ కూడా కొత్తగా..