ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమాకు ఫుల్ పాజిటివ్ రివ్యూస్.. సినిమా పేరు తో తి అని ఫుజి.. టైటిల్ ఒక్కటే కాదు కథ కూడా కొత్తగా..

ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమాకు ఫుల్ పాజిటివ్ రివ్యూస్.. సినిమా పేరు తో తి అని ఫుజి.. టైటిల్ ఒక్కటే కాదు కథ కూడా కొత్తగా..
  • టైటిల్: తో తి అని ఫుజి 
  • ప్లాట్‌‌ఫాం: సోనీ లివ్​
  • డైరెక్షన్: మోహిత్ తకల్కర్
  • కాస్ట్: లలిత్ ప్రభాకర్, మృణ్మయి గాడ్‌‌బోలే, ఓంప్రకాష్ షిండే, నత్సుకో ఫుజి

పుణెకు చెందిన ఆదిత్య (లలిత్ ప్రభాకర్), ఇషా (మృణ్మయి గాడ్‌‌బోలే) ఒకరినొకరు ప్రేమించుకుంటారు. కొన్నాళ్లకు ఆదిత్య తన కెరీర్ కోసం జపాన్ వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. అప్పటినుంచి వాళ్ల మధ్య దూరం పెరుగుతుంది. గొడవలు పెరుగుతాయి. ఇషా తనవాళ్లను వదిలి ఆదిత్యతో వెళ్లడానికి ఇష్టపడదు. దాంతో వాళ్లు విడిపోతారు. ఆదిత్య జపాన్‌‌ వెళ్లి స్థిరపడతాడు. సరిగ్గా ఏడేండ్ల తర్వాత అక్కడే ఒక జపాన్‌‌ అమ్మాయి (నత్సుకో ఫుజి)తో నిశ్చితార్థం చేసుకుంటాడు. 

అదే టైంలో ఇషా ట్రిప్ కోసం జపాన్ వెళ్తుంది. అనుకోకుండా ఫుజి పర్వతం దగ్గర వాళ్లు ముగ్గురూ కలుసుకుంటారు. ఆదిత్యను చూసిన ఇషా చాలా ఎమోషనల్ అవుతుంది. కానీ, అతనికి వేరొకరితో నిశ్చితార్థం జరిగిందని తెలిసి బాధపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? వాళ్లు ఇద్దరూ ఒక్కటయ్యారా? లేదా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

►ALSO READ | తాయ్ కళవి.. రాధికా శరత్ కుమార్ లీడ్ రోల్లో చేసిన ఈ సినిమా అంత బాగుందా..?