IPL 2026: ఐపీఎల్ 2026లో భాగంగా వాంఖడే స్టేడియంలో జరుగుతున్న హై-వోల్టేజ్ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) బ్యాటర్లు పూనకం వచ్చినట్లు బ్యాటింగ్ చేశారు. ముంబై ఇండియన్స్ బౌలర్లను ఉతికి ఆరేస్తూ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 240 పరుగుల భారీ స్కోరు సాధించారు.
సూపర్బ్ ఓపెనింగ్:
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీకి ఓపెనర్లు కళ్లు చెదిరే ఆరంభాన్ని ఇచ్చారు. ఫిల్ సాల్ట్ (36 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సులతో 78 పరుగులు) తొలి బంతి నుంచే ముంబై బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మరోవైపు విరాట్ కోహ్లీ (38 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సుతో 50 పరుగులు) క్లాస్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. వీరిద్దరూ కలిసి మొదటి వికెట్‌కు 120 పరుగులు జోడించి స్ట్రాంగ్ పునాది వేశారు. హాఫ్ సెంచరీ తర్వాత సాల్ట్ అవుట్ అవ్వగా, కోహ్లీ కూడా అర్థ సెంచరీ పూర్తి చేసుకున్న వెంటనే హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో అవుటయ్యాడు.
పాటిదార్ 'పిచ్చ కొట్టుడు':
ఓపెనర్లు వెనుదిరిగినా తర్వాత రన్ రేట్ ఏమాత్రం తగ్గలేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ (20 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సులతో 53 పరుగులు) మైదానంలో విధ్వంసం సృష్టించాడు. కేవలం 17 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది ముంబై బౌలర్లను బెంబేలెత్తించాడు. ఆ తర్వాత టిమ్ డేవిడ్ కూడా కనికరం లేకుండా చెలరేగిపోయాడు. టిమ్ డేవిడ్ (16 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సులతో 36 పరుగులు) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో ఆర్సీబీ స్కోరు 240 మార్కును తాకింది.
ముంబై బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా సహా మిగతా వారు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. మిచెల్ సాంట్నర్, హార్దిక్ పాండ్యా, శార్దూల్ ఠాకూర్, ట్రెంట్ బౌల్ట్ తలో వికెట్ పడగొట్టారు.. ముంబై ఇండియన్స్ విజయం సాధించాలంటే 20 ఓవర్లలో 241 రన్స్ చేయాల్సి ఉంది. వాంఖడే బ్యాటింగ్ పిచ్ అయినప్పటికీ, ఇంత భారీ లక్ష్యాన్ని ఛేజ్ చేయడం హార్దిక్ పాండ్యా సేనకు కచ్చితంగా అగ్నిపరీక్షే. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ముంబై ఈ రికార్డు ఛేజింగ్ చేస్తుందో లేదో వేచి చూద్దాం.
Brute force & pure ball striking 🔥
— IndianPremierLeague (@IPL) April 12, 2026
🎥 Tim David with the perfect finish as #RCB put 2️⃣4️⃣0️⃣ on the board 👊
Scorecard ▶️ https://t.co/q1MGJfD2d8#TATAIPL | #KhelBindaas | #MIvRCB | @rcbtweets pic.twitter.com/e2ek6dykNd
