FIFA World Cup: ఫిట్‌గా ఉండు, బ్రెజిల్ జట్టులో స్థానం సంపాదించుకో.. నేమార్‌కు కార్లో అన్సెలోట్టి హెచ్చరిక

FIFA World Cup: ఫిట్‌గా ఉండు, బ్రెజిల్ జట్టులో స్థానం సంపాదించుకో.. నేమార్‌కు కార్లో అన్సెలోట్టి హెచ్చరిక

FIFA World Cup: బ్రెజిల్ ఫుట్‌బాల్ స్టార్ నెయ్‌మార్ (Neymar) కెరీర్‌లో 2026 ఫిఫా వరల్డ్ కప్ ఒక కీలక మలుపుగా మారనుంది. ఒకప్పుడు బ్రెజిల్ జట్టులో తిరుగులేని ఆటగాడిగా వెలిగిన నెయ్‌మార్, ఇప్పుడు తన ఫిట్‌నెస్ నిరూపించుకోవడానికి పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక బ్రెజిల్ హెడ్ కోచ్ కార్లో అన్సెలోట్టి (Carlo Ancelotti) నెయ్‌మార్ ఎంపికపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవలం పేరు చూసి లేదా గత రికార్డులను బట్టి జట్టులోకి తీసుకోవడం కుదరదని స్పష్టం చేశారు.

కండిషన్స్ అప్లై!: 
బ్రెజిల్ ఫుడ్ బాల్ హెడ్ కోచ్ కార్లో మాట్లాడుతూ.. నెయ్‌మార్ తిరిగి వచ్చే అవకాశం ఉంది. కానీ, ఫిట్నెస్ ఉన్న ఆటగాళ్లను మాత్రమే నేను ఎంపిక చేస్తాను.. అతను బ్రెజిల్ ఫుట్‌బాల్ చరిత్రలో భాగం, కానీ ప్రస్తుత అవసరమే ముఖ్యమని పేర్కొన్నారు. త్వరలో జరగబోయే పనామా, ఈజిప్ట్ ఫ్రెండ్లీ మ్యాచ్‌లే నెయ్‌మార్‌కు చివరి అవకాశం.. బ్రెజిల్ వరల్డ్ కప్ జట్టును ఖరారు చేయడానికి నెయ్‌మార్‌కు ఇంకా రెండు నెలల సమయం ఉంది. ఈ లోపు అతను తన అత్యుత్తమ ప్రదర్శనను కనబరచాల్సి ఉంటుందని వెల్లడించాడు. 

►ALSO READ | IPL 2026: టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న ముంబై.. ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్

సుదీర్ఘ విరామం: 
అక్టోబర్ 2023లో ఉరుగ్వేతో జరిగిన మ్యాచ్‌లో నెయ్‌మార్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆ తర్వాత ACL రికవరీ, మోకాలి సర్జరీ కారణంగా దాదాపు ఏడాదిన్నర కాలంగా జాతీయ జట్టుకు దూరంగా ఉండిపోయాడు. ప్రస్తుతం 34 ఏళ్ల వయసు కలిగిన నెయ్‌మార్‌కు తన ఫామ్‌ను మళ్లీ అందుకోవడం పెద్ద సవాలుగా మారింది.

నెయ్‌మార్ రికార్డులు: 
* నెయ్‌మార్ 128 మ్యాచ్‌లలో 79 గోల్స్‌తో బ్రెజిల్ తరపున అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా నిలిచాడు.
* పనామా, ఈజిప్ట్‌లతో జరగబోయే ఫ్రెండ్లీ మ్యాచ్‌లు, సెలెక్టర్లను ఆకట్టుకోవడానికి నెయ్‌మార్‌కు చివరి అవకాశం
* బ్రెజిల్ జట్టుకు ఎన్నో అద్భుత విజయాలు అందించిన లెజెండరీ ప్లేయర్.