హైదరాబాద్: హైదరాబాద్ బేగం పేట యాక్సిస్ బ్యాంకులో భారీ స్కాం వెలుగుచూసింది. బ్యాంకు మేనేజర్ వెంకట రమణ 7 కోట్ల రూపాయలు కొట్టేసిన ఘటన బ్యాంకు సిబ్బందిని విస్తుపోయేలా చేసింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆస్ట్రేలియాకి చెందిన ఓ ఎన్ఆర్ఐ అకౌంట్ నుంచి సదరు బ్యాంకు మేనేజర్ వెంకట రమణ 7 కోట్ల రూపాయలు కొట్టేశాడు. చెక్ల సాయంతో ఎన్ఆర్ఐ సంతకాన్ని ఫోర్జరీ చేసి బ్యాంకు మేనేజర్ డబ్బులు కాజేశాడు. 41 విడతల్లో నిందితుడు ఏడు కోట్ల రూపాయలు కాజేసిండని విచారణలో వెల్లడైంది.
స్కాంలో బ్యాంక్ మేనేజర్తో పాటు కింది స్థాయి సిబ్బంది ప్రమేయం ఉన్నట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 2024లోనే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో బాధితుడు ఫిర్యాదు చేశాడు. పోలీసుల విచారణకు హాజరు కాకుండా, దర్యాప్తునకు సహకరించకుండా బ్యాంకు మేనేజర్ ఇన్నాళ్లూ తప్పించుకుని తిరిగాడు. ఎట్టకేలకు బ్యాంక్ మేనేజర్ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
