Rohit Sharma Injury: ఆర్సీబీతో హై-వోల్టేజ్ మ్యాచ్‌.. గాయపడిన రోహిత్ శర్మ

Rohit Sharma Injury: ఆర్సీబీతో హై-వోల్టేజ్ మ్యాచ్‌.. గాయపడిన రోహిత్ శర్మ

Rohit Sharma Injury: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న హై-వోల్టేజ్ మ్యాచ్‌లో ముంబై స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ గాయపడటంతో మైదానంలో కాసేపు ఆందోళనకర వాతావరణం నెలకొంది. ఆర్సీబీ ఇచ్చిన 240 రన్స్ ఛేజింగ్ సమయంలో బ్యాటింగ్ చేస్తున్న హిట్ మ్యాన్ తన కుడి కాలి హామ్‌స్ట్రింగ్ (Hamstring) నొప్పితో ఇబ్బంది పడుతూ కనిపించాడు. నడవడానికి కూడా కష్టపడటంతో వెంటనే ఫిజియో మైదానంలోకి వచ్చారు. పరిస్థితి చూస్తుంటే రోహిత్ మైదానం వెనుదిరుగుతాడని అందరూ భావించారు.

పరిస్థితి తీవ్రతను గమనించిన ముంబై ఇండియన్స్ జట్టుకు చెందిన ముగ్గురు సబ్‌స్టిట్యూట్ ప్లేయర్లు ఫిజియోతో కలిసి మైదానంలోకి వచ్చారు. రోహిత్ తన ట్రౌజర్‌ను సరిచేసుకుని, కుడి కాలి హామ్‌స్ట్రింగ్ వద్ద ఫిజియోతో పట్టీలు (Strapping) కట్టించుకున్నాడు. ఈ క్రమంలో అంపైర్లు కూడా ఆట ఎంత సమయం ఆగుతుందోనని నిశితంగా గమనించారు. ఫిజియో ఇచ్చిన చికిత్స, స్ట్రాపింగ్ తర్వాత హిట్ మ్యాన్ మళ్ళీ బ్యాటింగ్ చేయడానికి సిద్ధమయ్యాడు. 

►ALSO READ | IPL 2026: ఆర్సీబీ విధ్వంసకర బ్యాటింగ్.. ముంబై బౌలర్లకు చుక్కలు చూపించిన సాల్ట్, పాటిదార్

కాగా భారీ లక్ష్య ఛేదనలో ఉన్న ముంబై ఇండియన్స్ జట్టుకి రోహిత్ శర్మ క్రీజులో ఉండటం అత్యంత కీలకం. కాలి నొప్పితోనే అతను ఇన్నింగ్స్‌ను ఎలా ముందుకు తీసుకెళ్తాడో చూడాలి మరీ.. ఇప్పటికే రోహిత్ శర్మ 13 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్సుతో 19 పరుగులు చేసి రిటైర్డ్ హార్ట్ గా మైదానం వీడాడు.