బెంగాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సిండికేట్ పాలనను అంతం చేస్తం.. అధికారంలోకి రాగానే యూసీసీ అమలు: ప్రధాని మోడీ

బెంగాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సిండికేట్ పాలనను అంతం చేస్తం.. అధికారంలోకి రాగానే యూసీసీ అమలు: ప్రధాని మోడీ

కోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కతా: బెంగాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మాఫియా, సిండికేట్లు శాసిస్తున్నాయని, రాష్ట్రాన్ని అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అరాచకానికి నిలయంగా మార్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే సిండికేట్ పాలన(అధికార పార్టీ అండతో నడిచే మాఫియా తరహా వ్యవస్థ) లను అంతం చేస్తమని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ శనివారం దినాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్ జిల్లా, ముర్షిదాబాద్ జిల్లాల్లో పర్యటించారు. 

కుష్మాండి, జంగీపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో నిర్వహించిన భారీ బహిరంగ సభల్లో మోదీ మాట్లాడుతూ.. 2026 అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్రంలో టీఎంసీ సృష్టించిన భయానికి, బీజేపీ ఇచ్చే నమ్మకానికి మధ్య జరుగుతున్న పోరాటమని అభివర్ణించారు. భయంపై నమ్మకం విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.‘రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే టీఎంసీ హయాంలో మహిళలపై జరిగిన ప్రతి అకృత్యంపై విచారణ జరిపిస్తాం. ప్రతి అత్యాచార కేసు ఫైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మళ్లీ తెరుస్తాం. దోషులను విడిచిపెట్టే ప్రసక్తే లేదు. 

ముఖ్యంగా ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ఘటనపై బెంగాల్ ప్రజలంతా పార్టీలకు అతీతంగా ఏకమై పోరాడాలి. టీచర్ల నియామకంలో అవినీతికి పాల్పడినవారందరూ జైలు ఊచలు లెక్కపెట్టాల్సిందే" అని హెచ్చరించారు. గతేడాది డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఫుట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాల్ దిగ్గజం మెస్సీ కోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కతాకు వచ్చినప్పుడు కూడా మమత సర్కార్ సరైన భద్రతా ఏర్పాట్లు చేయలేదని ఆరోపించారు. ఈ ఆటను కూడా తన సిండికేట్లకు అప్పగించి భ్రష్టు పట్టించిందని విమర్శించారు.ఇక్కడ సిండికేటే ప్రభుత్వం.. ప్రభుత్వమే సిండికేట్ అని మోదీ మండిపడ్డారు.

బెంగాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో యూసీసీ అమలు చేస్తం

రాష్ట్రంలో టీఎంసీ ప్రభుత్వం చేస్తున్న బుజ్జగింపు రాజకీయాలకు కాలం చెల్లిందని మోదీ తెలిపారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే రాష్ట్రంలో యూనిఫాం సివిల్ కోడ్(యూసీసీ) అమలు చేస్తామని ప్రకటించారు. బెంగాలీలను మైనారిటీలుగా మారనివ్వబోమని స్పష్టం చేశారు. మతువా, నమశూద్ర సామాజిక వర్గాలకు పౌరసత్వం కల్పిస్తామని తెలిపారు. మహిళలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 33 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని వెల్లడించారు. 

రాష్ట్రంలో చొరబాటుదారులను ఏరివేస్తామని స్పష్టం చేశారు. ‘బెంగాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై 8 లక్షల కోట్ల అప్పు ఉంది. సిండికేట్​రాజ్ వల్ల పరిశ్రమలు రాష్ట్రం వదిలి వెళ్తున్నాయి. దీనివల్ల యువత వలస బాట పడుతున్నది. గతంలో కమ్యూనిస్టుల పాలన నుంచి విముక్తి కోసం ప్రజలు టీఎంసీకి ఛాన్స్ ఇచ్చారు. కానీ ఆయుధాలు, డ్రగ్స్, పశువుల స్మగ్లింగ్.. ఇలా ప్రతి అక్రమ పనికి టీఎంసీ కాంట్రాక్టు తీసుకుంటున్నది. 

దేశమంతా రామ నవమి వేడుకలు ప్రశాంతంగా జరిగితే.. బెంగాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మాత్రం ఊరేగింపులపై దాడులు జరుగుతున్నాయి. ఓటమి భయంతో టీఎంసీ నేతలు ఏఐ ద్వారా క్రియేట్ చేసిన ఫేక్ వీడియోలను ప్రచారం చేస్తున్నారు. బెంగాల్ అభివృద్ధి చెందాలంటే ‘డబుల్ ఇంజిన్’ సర్కార్ రావాలి" అని మోదీ అన్నారు.