రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
8న రాష్ట్ర బడ్జెట్..
గవర్నర్‌తో సీఎం భేటీ.. ప్రసంగం కాపీ అందజేత
మార్చి 21, 24 వరకు అసెంబ్లీ సమావేశాలకు చాన్స్
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం మొదలు కానున్నాయి. మొదటిరోజు అసెంబ్లీ, మండలి జాయింట్ మీటింగ్ జరుగనుంది. ఇందులో గవర్నర్ తమిళిసై ప్రసంగించనున్నారు. గవర్నర్‌గా ఆమె బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి అసెంబ్లీకి రానున్నారు. బడ్జెట్‌సమావేశాలకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. సీఎం కేసీఆర్బుధవారం గవర్నర్ తమిళిసైని కలిశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణ తీరుపై వివరించారు. అసెంబ్లీ జాయింట్మీటింగ్ కు సంబంధించిన ప్రసంగం కాపీని గవర్నర్‌కు అందజేశారు. ఈ నెల 8న బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నట్లు వివరించారు. బడ్జెట్రూపకల్పన, దానిలోని పలు కీలక అంశాలను సైతం గవర్నర్ దృష్టికి తెచ్చారు. సాగునీటి పారుదల, వ్యవసాయం, సంక్షేమ రంగాలకు అధిక ప్రాధాన్యం కొనసాగించనున్నట్లు సీఎం వివరించారు. మార్చి 21 లేదా 24 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. శుక్రవారం మధ్యాహ్నం జరగనున్న బీఏసీ మీటింగ్‌లో దీనిపై స్పష్టత రానుంది. ఈ అసెంబ్లీ సమావేశాల్లో కొత్త రెవెన్యూ చట్టాన్ని తేవాలని సీఎం భావిస్తున్నారు. ఇదే విషయాన్ని ఆయన పలుసార్లు చెప్పారు.
ఆఫీసర్స్ లాంజ్ఓపెనింగ్
అసెంబ్లీ బిల్డింగ్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన ఆఫీసర్స్ లాంజ్‌ని బుధవారం స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణ ఏర్పాట్లపై మండలి చైర్మన్‌గుత్తా సుఖేందర్‌రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, అసెంబ్లీ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పోలీసు శాఖ ఉన్నతాధికారులతోపాటు సంబంధిత ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మండలి వైస్ చైర్మన్ నేతి విద్యాసాగర్, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్టి.పద్మారావు, ప్రభుత్వ చీఫ్ విప్‌లు దాస్యం వినయభాస్కర్, బోడకుంట వెంకటేశ్వర్లు, సీఎస్ సోమేశ్‌కుమార్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణారావు, అసెంబ్లీ కార్యదర్శి వి.నర్సింహాచార్యులు, డీజీపీ మహేందర్‌రెడ్డి, ఎస్పీఎఫ్ డీజీ తేజ్‌దీప్‌కౌర్, హైదరాబాద్ సీపీ అంజనీకుమార్, రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తదితరులు పాల్గొన్నారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని పోలీసు ఉన్నతాధికారులు వివరించారు.
