టమాటా ధరలు తగ్గించు తల్లీ...508 టమాటాలతో అమ్మవారికి దండ..

టమాటా ధరలు తగ్గించు తల్లీ...508 టమాటాలతో అమ్మవారికి దండ..

దేశ వ్యాప్తంగా టమాటా ధరలు మండిపోతున్నాయి. రికార్డు స్థాయిలో టమాటా ధర పలుకుతోంది.   ధరలు విపరీతంగా పెరగడంతో సామాన్యుడు టమాటా వండుకోలేని పరిస్థితి నెలకొంది. అన్ని కూరగాయలను కొనుగోలు చేస్తున్న వినియోగదారుడు..టమాటా అంటేనే  వామ్మో అంటున్నాడు.  టమాటా ధరల పెరుగుదలతో దేశ వ్యాప్తంగా చిత్ర విచిత్రమైన సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. కొందరు  టమాటాలను ఎత్తుకెళ్తే..మరికొందరు టమాటాల కోసం తనఖా పెడుతున్నారు. తాజాగా టమాటాల కోసం కొందరు పూజలు నిర్వహించారు. 

టమాటాల ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో తమిళనాడలోని  అమ్మవారి ఆలయంలో  ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాగపట్టణం జిల్లా కరుకుడిలో 508 టమాటాలతో ప్రత్యేకంగా తయారు చేసిన దండతో అమ్మవారిని అలంకరించారు. ఆడిమాస పౌర్ణమి సందర్భంగా శ్రీ మరియమ్మన్, నాగమ్మన్ దేవాలయంలో పూలు, నిమ్మకాయల దండలతో పాటు టమాటాల దండతో విగ్రహాలను అలకరించారు. టమాటా ధరలు తగ్గాలని ప్రత్యేక పూజలు చేశారు.  ఈ పూజల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. టమాటా ధరలు తగ్గాలని మొక్కుకున్నారు. పూజల అనంతరం అమ్మవారి మెడలో వేసిన టమాటాలను భక్తులకు ప్రసాదంగా పూజారులు పంచిపెట్టారు.

కాగా, ఓ వస్తువు నిత్యావసరంగా మారడం.. ప్రతికూల పరిస్థితుల వల్ల దానిని వదిలేయడం ఇప్పుడు ఓ సవాలుగా మారింది. ధరల విషయానికి వస్తే రానున్న రోజుల్లో టమాటా ధరలు కిలో రూ.300కు చేరే అవకాశం ఉందని, మిగతా కూరగాయల ధరలు కూడా పెరుగుతున్నాయని హోల్ సేల్ వ్యాపారులు చెబుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. హోల్‌సేల్ మార్కెట్‌లో కిలో రూ.160 ఉన్న టమాటా ధర ప్రస్తుతం రూ.220కి చేరింది. దీంతో రిటైల్‌ ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. పంట అధికంగా పండే ప్రాంతాలలో ముందు ఎండలు, తర్వాత భారీ వర్షాల కారణంగా సరఫరాలో అంతరాయాల వల్ల నెలకు పైగా టమోటా ధరలు పెరుగుతూనే ఉన్నాయి

మరోవైపు రోజు రోజుకు టమాటా ధరలు పెరిగిపోతున్నాయి. పలు రాష్ట్రాల్లోని మార్కెట్లలో కిలో టమాటా 150 రూపాయల పైనే పలుకుతోంది. అయితే రానున్న రోజుల్లో టమాటా ధరలు కిలో రూ.300కు చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో పాటు  మిగతా కూరగాయల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.