పర్యావరణ ఫ్రెండ్లీగా మారిన..గ్రీన్​ స్టే 

పర్యావరణ ఫ్రెండ్లీగా మారిన..గ్రీన్​ స్టే 

యు.కె.లో హాస్పిటాలిటీ సెక్టార్​లో1.3 బిలియన్​ పౌండ్ల కంటే ఎక్కువగా కార్బన్​ ఎమిషన్స్​ విడుదలవుతున్నట్టు ఒక నివేదికలో వెల్లడైంది. దాంతో ఆ దేశంలోని కొన్ని హోటల్స్​ ఈ కార్బన్​ ఎమిషన్స్​ తగ్గించేందుకు ఏం చేయొచ్చు అని ఆలోచించి, అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. అందులో భాగంగా ఇంగ్లండ్​ బాన్​మత్​ టౌన్​లో ఉన్న ‘గ్రీన్​ హౌస్​’ హోటల్​ను పర్యావరణ ఫ్రెండ్లీగా మార్చేశారు. 

అందుకోసం ఆ హోటల్​ వాళ్లు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారో చెప్పాడు హోటల్​ మేనేజర్​ నీల్​ కార్టర్. ‘‘కార్బన్​ ఎమిషన్స్​ (కర్బన ఉద్గారాల) విడుదలను తగ్గించేందుకు రకరకాల పద్ధతులు పాటిస్తుంటారు. అలానే మా గ్రీన్ హౌస్​ హోటల్​లో సోలార్​ పానెల్స్​ ఇన్​స్టాల్​ చేశాం. ఎలక్ట్రిక్​ వెహికల్స్​ ఛార్జింగ్​ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. లాండ్రీ కోసం ఓజోన్​ గ్యాస్​ వాడుతున్నాం.

ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వెనక పర్యావరణానికి సంబంధించిన కొన్ని లెక్కలు ఇవి. యు.కె.లో హాస్పిటాలిటీ ఇండస్ట్రీనుంచి కర్బన ఉద్గారాలు ఏడాదికి ఎనిమిది మిలియన్ల టన్నులు విడుదల అవుతున్నాయి అని ఆ లెక్కలు చెప్తున్నాయి. అందుకని కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు మా వంతు ప్రయత్నం చేస్తున్నాం.

32 గదుల ఈ హోటల్​ బాన్​మత్​ టౌన్​లోని​ గ్రోవ్​ రోడ్​లో, గ్రేడ్​ 4 విక్టోరియన్​ విల్లాలో ఉంది.  తిండి, నిద్ర, అంతెందుకు శ్వాసించే గాలి కూడా బాగుండాలని 2010లో దీన్ని పునరుద్ధరించాం. అందులో భాగంగా ఎనర్జీ వాడకం తగ్గించేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. సోలార్​ ప్యానెల్స్​ ఏర్పాటుచేశాం. అలాగే హీట్​, పవర్​ యూనిట్స్​ కలిపి ఎక్కువ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్​ చేస్తున్నాం. సెన్సర్​ ట్యాప్స్​, షవర్​ హెడ్స్​ ఉన్నాయి. వాటివల్ల 25శాతం నీటి వినియోగం తగ్గింది. ఇంటెలిజెంట్ సెన్సర్స్​తో లెడ్ లైటింగ్​, లోకల్​గా దొరికే చెక్కతో ఫర్నిచర్​ తయారుచేయించాం. లాండ్రీలో ఓజోన్​ గ్యాస్​ వాడుతున్నాం. దీనివల్ల వాష్​ సైకిల్స్​ 15డిగ్రీల సెంటిగ్రేడ్​ కంటే తక్కువ ఉష్ణోగ్రతతో​ తిరుగుతాయి.

కిచెన్​లో ఇండక్షన్​ బర్నర్స్​ వాడతాం. వేస్ట్ ఫుడ్​ను ఎనరోబిక్ డైజెస్టర్​కు పంపిస్తున్నాం. ఈ ప్రాసెస్​లో బయోవేస్ట్​ ద్వారా బయో గ్యాస్​ తయారవుతుంది. ఇలా కర్బన ఉద్గారాల విడుదల తగ్గించేందుకు పలు రకాల టెక్నిక్స్​ వాడుతున్నాం. కార్బన్​ ట్రస్ట్​ విడుదలచేసిన నివేదిక ప్రకారం​ యు.కె. హాస్పిటాలిటీ సెక్టార్​లో ఒక ఏడాదికి అయ్యే ఎనర్జీ కాస్ట్1.3 బిలియన్​ పౌండ్ల కంటే ఎక్కువ.

దాని ఫలితంగా ఏడాదికి ఎనిమిది మిలియన్​ టన్నుల కంటే ఎక్కువ కర్బన ఉద్గారాలు విడుదలవుతున్నాయి. అంతేకాకుండా హోటల్స్​లో చాలావరకు పాత బిల్డింగ్స్​లో ఉన్నాయి. వాటిలో హీటింగ్​, లైటింగ్​, హాట్​ వాటర్​, క్యాటరింగ్​ వంటి వాటికోసం ఎక్కువ ఎనర్జీ వేస్ట్​ చేస్తున్నారని ఆ ట్రస్ట్​  అభిప్రాయపడింది కూడా.

యు.కె. హాస్పిటాలిటీ సెక్టార్​లో ఎనర్జీ సేవింగ్​ చేయాలంటే వాడకాన్ని తగ్గించాలి. అలా తగ్గిస్తే 10 నుంచి 40 శాతం వరకు ప్రభావం ఉంటుంది. రిసార్ట్​ల్లో ఒక రాత్రి స్టే చేసే వాళ్లు ఏడాదికి ఒక మిలియన్​ మంది ఉంటున్నారు. బీసీపీ కౌన్సిల్​ క్లైమేట్​ యాక్షన్​ ప్లాన్​ మీద టూరిజం ఎఫెక్ట్​ అనే విషయంపై పనిచేస్తోంది.

అందులోభాగంగా సస్టెయినబుల్​ ట్రాన్స్​పోర్ట్, వేస్టేజ్​ అనే విషయాల మీద దృష్టి పెట్టింది. పర్యావరణం బాగు కోసం మేం చేయాల్సింది ఇంకా చాలా ఉంది. మా కంటే ఇంకా బాగా ఈ విషయంలో ట్రై చేస్తున్న హోటల్స్​ ఇంకా చాలా ఉన్నాయి” అన్నాడు.