నాడు YSR చూపిన విజ్ఞతను మెచ్చుకోవాలి: చంద్రబాబు

నాడు YSR చూపిన విజ్ఞతను మెచ్చుకోవాలి: చంద్రబాబు

మీడియాపై నియంత్రణకు నాడు YSR తెచ్చిన జీవోను మరింత కఠిన నిబంధనలతో సీఎం వైఎస్ జగన్ మళ్లీ తీసుకొచ్చారని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. నాడు జర్నలిస్టు ఆందోళనలకు భయపడి YSR వెనక్కి తగ్గి, ఆ జీవోను రద్దు చేశారని చంద్రబాబు గుర్తు చేశారు. జగన్ చరిత్ర చదువుకుని ముందుకెళ్తే బాగుంటుందని చెప్పారు. నాడు రాజశేఖర్ రెడ్డి చూపిన విజ్ఞతను అభినందించాలని అన్నారు.

వైఎస్ వివేకా హత్య మీద ఎవరూ మాట్లాడకూడదని డీజీపీ ఎలా అంటారని చంద్రబాబు నిలదీశారు. వివేకా హత్య కేసులో, ఎస్పీలను, సిట్ లను ఎందుకు మార్చారని ప్రశ్నించారాయన. వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దారుణంగా మాట్లాడుతుంటే రాష్ట్రంలో అడ్డుకునే దిక్కు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జర్నలిస్ట్ యూనియన్ లనే బెదిరిస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. ఆమంచి కుటుంబ సభ్యులు పోలీసులను అన్న మాటలు డీజీపీకి వినిపించలేదా అని ప్రశ్నించారు.