టీడీపీ నేత దారుణ హత్య

టీడీపీ నేత దారుణ హత్య

కర్నూలు జిల్లాలో మరోసారి ఫ్యాక్షనిజం భగ్గుమంది. టీడీపీ నేత సుబ్బారావు దారుణంగా హత్యకు గురయ్యాడు. బనగానపల్లె కొలిమిగుండ్ల మండలంలోని బెలూన్ గుహల దగ్గర మంగళవారం మధ్యాహ్నం కాపు కాసిన ప్రత్యర్ధులు సుబ్బారావును వేటకొడవళ్లతో నరికి…తర్వాత బండరాయితో తలపై మోది  హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఈ దారుణ ఘటనకు వ్యాపార లావాదేవీలే కారణమని చెబుతున్నారు.

సుబ్బారావు స్వస్థలం కొలిమిగుండ్ల మండలం చింతలాయపల్లె. ఈయన బనగానపల్లి మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్ధన్ రెడ్డి ప్రధాన అనుచరుడు.