టీడీపీ నేతల అరెస్ట్

టీడీపీ నేతల అరెస్ట్

చలో సెక్రటేరియట్ నిరసనకు బయల్దేరి .. ఇందిరాపార్క్ వరకు వచ్చిచన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులను పోలీసులు ముందుగా అరెస్ట్ చేశారు. రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ, ఇతర నాయకులను ప్రత్యేక వాహనంలో ఎక్కించారు. ఐతే… ఆ తర్వాత నాయకుల విన్నపంతో… ఎల్ రమణను నిరసన స్థలానికి పంపించారు. మిగిలిన టీడీపీ నేతలను అదుపులోకి తీసుకుని ప్రత్యేక వాహనంలో అక్కడినుంచి వేరే చోటకు తీసుకెళ్లారు.

ప్రజాస్వామ్యంలో శాంతియుత నిరసనకు పోలీసులు అనుమతించాలని కోరారు రమణ. వచ్చిన నాయకులందరినీ ఇందిరాపార్క్ లో నిరసనకు అనుమతించాలని డిమాండ్ చేశారు.

ఐతే.. ఇందిరాపార్క్ దగ్గర లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందని చెబుతున్న పోలీసులు… నిరసనకు వస్తున్నవారిని అదుపులోకి తీసుకుని బొలారం, గోషామహల్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్తున్నారు.