కనీస వేతనాలు భారీగా పెంపు..అన్ స్కిల్డ్లో మినిమం శాలరీ రూ.16 వేలు, హైలీ స్కిల్డ్ రూ.20 వేలు

కనీస వేతనాలు భారీగా పెంపు..అన్ స్కిల్డ్లో మినిమం శాలరీ రూ.16 వేలు, హైలీ స్కిల్డ్ రూ.20 వేలు
  •  
  • అన్​ స్కిల్డ్​లో మినిమం శాలరీ రూ.16 వేలు, సెమీ స్కిల్డ్​లో రూ.17 వేలు, స్కిల్డ్​లో రూ.18,500, హైలీ స్కిల్డ్​ రూ.20 వేలు
  • కార్మికుల్లో నాలుగు కేటగిరీలు.. మూడు జోన్లుగా విభజన
  • రాష్ట్రంలో కోటీ 11 లక్షల మంది కార్మికులకు లబ్ధి చేకూర్చేలా నిర్ణయం
  • జూన్ 1, 2026 నుంచి కనీస వేతనాల అమలు.. ప్రైవేట్ కంపెనీలపై నిఘా
  • లేబర్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ బలోపేతం.. బ్లూ కాలర్ ఉద్యోగాలపైనే ప్రభుత్వం ఫుల్ ​ఫోకస్ 
  • గల్ఫ్ వలసలను సంస్థాగతం చేయబోతున్నాం: సీఎం రేవంత్ రెడ్డి
  • 80% స్థానిక కోటా అమలు చేయాల్సిందే: కార్మిక శాఖ మంత్రి వివేక్​

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కోటీ 11 లక్షల మంది కార్మికులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. శ్రామిక శ్రేయస్సే లక్ష్యంగా కనీస వేతనాలను భారీగా పెంచుతూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది జూన్ 1 నుంచి పెంచిన వేతనాలు అమల్లోకి తెస్తామని సీఎం రేవంత్​రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు  గురువారం సెక్రటేరియెట్​లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత పదేండ్ల బీఆర్​ఎస్​ పాలనలో కార్మికుల కనీస వేతనాల సవరణను పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్ల కార్మికులు తీవ్రంగా నష్టపోయారని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి రాగానే కార్మికుల హక్కులను కాపాడేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పరిశ్రమల శాఖల మంత్రి శ్రీధర్ బాబు, కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామితో కూడిన ‘కేబినెట్ సబ్ కమిటీ’ ఏర్పాటు చేశామన్నారు. ఈ కమిటీ కార్మిక సంఘాలతో, పరిశ్రమల ప్రతినిధులతో చర్చించి, అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా ఈ చారిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకుందని సీఎం స్పష్టం చేశారు.

నాలుగు కేటగిరీలు.. మూడు జోన్ల వారీగా వర్గీకరణ

కార్మికుల నైపుణ్యాన్ని బట్టి నాలుగు కేటగిరీలుగా, వారు నివసించే ప్రాంతాల్లోని జీవన వ్యయం, ద్రవ్యోల్బణం, నిత్యావసర వస్తువుల ధరలు, ఇంటి అద్దెల ప్రకారం మూడు జోన్లుగా విభజించినట్లు సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. గతంలో కేవలం అర్బన్, రూరల్ అనే రెండు జోన్లు మాత్రమే ఉండేవని, ఈసారి శాస్త్రీయంగా మూడు జోన్లను ఏర్పాటు చేశామని చెప్పారు.


మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిని జోన్-1 కింద, మున్సిపాలిటీలను జోన్- 2 కింద, గ్రామీణ ప్రాంతాలు ఇతర ప్రాంతాల్లోని పరిశ్రమలను జోన్-3 కిందికి తెచ్చినట్లు తెలిపారు. జోన్-1 లో నివసించే కార్మికులకు జీవన వ్యయం ఎక్కువగా ఉంటుందనే ఉద్దేశంతో అక్కడ వేతనాలు ఎక్కువ ఉండేలా నిర్ణయించామన్నారు. ఉద్యోగుల జీతభత్యాలు, పనిదినాలు ప్రతి నెలా ఒకటో తేదీ నుంచే లెక్కిస్తారు కాబట్టి ఈ నూతన వేతనాలను ఈ ఏడాది జూన్ 1 నుంచి అమలు చేయాలని నిర్ణయించామన్నారు. మే 1వ తేదీ (మే డే) నాడే ప్రకటించాలనుకున్నప్పటికీ, మరికొందరి సలహాలు, సూచనలు పరిగణనలోకి తీసుకోవడం వల్ల జూన్ 1 నుంచి అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నిర్ణయం తీసుకోవడానికి సహకరించిన కార్మిక సంఘాలు, వ్యాపార సంస్థల ప్రతినిధులకు సీఎం ధన్యవాదాలు తెలిపారు.

లేబర్​ డిపార్ట్​మెంట్​ ద్వారా పర్యవేక్షణ

పెంచిన కనీస వేతనాలను ప్రైవేట్ కంపెనీలు చెల్లిస్తున్నాయా లేదా అనే అంశాన్ని పర్యవేక్షించడానికి బలమైన లేబర్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ వ్యవస్థ సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కార్మికుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా లేబర్ కమిషనర్ కార్యాలయం లేదంటే జిల్లాల వారీగా ఉన్న వ్యవస్థల ద్వారా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గొప్ప కార్మిక నాయకుడైన వెంకటస్వామి వారసుడిగా, కార్మికుల సమస్యలపై సంపూర్ణ అవగాహన ఉన్న వివేక్ వెంకటస్వామి ఈ శాఖకు మంత్రిగా ఉండడం కార్మికుల అదృష్టమని సీఎం కొనియాడారు. పరిశ్రమ యజమానిగా, కార్మిక నేతగా వారికి రెండు వైపులా ఉన్న సమస్యలు తెలుసని, పూర్తి బాధ్యతతో కార్మికుల సంక్షేమం కోసం వారు అద్భుతమైన నిర్ణయాలు తీసుకుంటారని చెప్పారు. 

 ఐటీఐల అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గ్రేడేషన్.. టాటా సంస్థతో పదేండ్ల ఒప్పందం

రాష్ట్రంలో సాంకేతిక విప్లవాన్ని తీసుకువచ్చేందుకు ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని సీఎం తెలిపారు. రూ.4 వేల కోట్ల వ్యయంతో 65 ఐటీఐలను అడ్వాన్సుడ్ ట్రైనింగ్ సెంటర్లుగా మార్చేందుకు టాటా ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఒప్పందం చేసుకున్నామన్నారు. మిగిలిన నియోజకవర్గాల్లో కూడా మరో 56 కొత్త ఏటీసీలను మంజూరు చేశామని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయన్నారు. సీఐఐ ప్రతినిధులతో నాలుగో నగరంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పరిశ్రమలకు ఎలాంటి వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్ కావాలో చర్చించి, దానికి అనుగుణంగా ఐటీఐ కోర్సులను మార్చామని వెల్లడించారు. నెక్స్ట్ టూ ఇయర్స్ లో పరిశ్రమలకు అవసరమైన పూర్తి స్థాయి స్కిల్డ్ లేబర్ బయటకు వస్తారన్నారు. ఏటీసీలలో జాయిన్ అయిన విద్యార్థులకు నెలకు రూ.2 వేల స్టైఫండ్ ఇస్తున్నామని, భవిష్యత్తులో స్కిల్ యూనివర్సిటీ, పాలిటెక్నిక్ విద్యార్థులకు కూడా ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. ఈ కేంద్రాల్లో ఫ్యాకల్టీ సమస్య లేదని, టాటా సంస్థే వచ్చే పదేండ్లపాటు ట్రైనర్స్ సపోర్ట్ అందిస్తుందని స్పష్టం చేశారు. మల్లేపల్లిలో నాలుగు ఐటీఐలను ఏటీసీలుగా మార్చి నడుపుతున్నామని, అక్కడ ఇందిరమ్మ ఇళ్ల శిలాఫలకం తయారీ ఆర్డర్లు కూడా ఇచ్చామని తెలిపారు. ఈ ఏటీసీలలోని అడ్వాన్స్ టెక్నాలజీని మీడియా మిత్రులు స్వయంగా చూసేందుకు ఈ నెలాఖరులోగా మంత్రి వివేక్ వెంకటస్వామి నేతృత్వంలో ఒక క్షేత్రస్థాయి పర్యటన ఏర్పాటు చేస్తామన్నారు.

 గ్లోబల్ అవకాశాలు.. గల్ఫ్ కార్మికులకు కొత్త పాలసీ

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తుఫాన్ వల్ల అమెరికా లాంటి దేశాల్లో ఐటీ రంగానికి చెందిన వైట్ కాలర్ ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయని, లక్షలాది మంది తిరిగి సొంత ఊళ్లకు వచ్చే పరిస్థితి నెలకొందని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. కానీ, బ్లూ కాలర్ ఉద్యోగాలను ఏఐ రీప్లేస్ చేయలేదన్నారు. జర్మనీ, జపాన్, సౌత్ కొరియా, సింగపూర్ వంటి దేశాల్లో నర్సింగ్, ఇతర సాంకేతిక రంగాల్లో కోట్ల కొద్దీ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. జీవన ప్రమాణాలు కూడా ఈ దేశాల్లో అమెరికా కంటే చాలా అద్భుతంగా ఉన్నాయని, తాను స్వయంగా చూసి వచ్చానని చెప్పారు. చైనా, జపాన్, జర్మనీ దేశాల ప్రజలకు ఇంగ్లీష్ రాకపోయినా సాంకేతిక నైపుణ్యంతో ప్రపంచాన్ని శాసిస్తున్నారని, అమెరికా కేవలం బ్రాండ్లను మాత్రమే కలిగి ఉండి ఆయా దేశాల నుంచి వస్తువులను వినియోగిస్తోందని వివరించారు. మన యువత కూడా సాంకేతిక నైపుణ్యంతో పాటు జర్మన్, జపనీస్, కొరియన్ లాంగ్వేజెస్ నేర్చుకునేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందన్నారు. 

ఆ పరిశ్రమల్లో 80 శాతం స్థానిక కోటా అమలు చేయాల్సిందే: మంత్రి వివేక్​ వెంకటస్వామి 

ప్రభుత్వ భూములు, సర్కారు నుంచి పన్ను మినహాయింపులు, సబ్సిడీలు పొందిన పరిశ్రమల్లో 80 శాతం స్థానిక కోటా నిబంధనను కచ్చితంగా అమలు చేయిస్తామని కార్మిక శాఖ మంత్రి డాక్టర్​ వివేక్​ వెంకటస్వామి స్పష్టం చేశారు. కానీ సొంత పెట్టుబడులు, నిధులతో పరిశ్రమలు పెట్టేవారిపై కఠిన నిబంధనలు విధిస్తే పెట్టుబడులు తరలిపోయే ప్రమాదం ఉన్నందున ఈ అంశంపై మరింత విస్తృత చర్చ జరగాల్సి ఉందన్నారు. అయినప్పటికీ పరిశ్రమలకు అనుమతులు ఇచ్చేటప్పుడే స్థానిక యువతకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని యజమానులకు స్పష్టం చేస్తున్నామని చెప్పారు. సింగరేణి సంస్థలో తాము అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే 80 శాతం లోకల్ రిక్రూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు జీవో ఇచ్చామని గుర్తుచేశారు. ఈ కనీస వేతనాల అమలు అనంతరం, సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంచడానికి కూడా త్వరలోనే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 

రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి, కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా ప్రతి ఐదేళ్లకోసారి కనీస వేతనాల సవరణ చేపట్టడం ఎంతో అవసరమన్నారు. మెనిఫెస్టోలో చెప్పినట్లుగా ఇప్పుడు కనీస వేతనాలను సవరిస్తున్నామన్నారు. కార్మికులకు సరైన వేతనాలు అందించినప్పుడే ఉత్పాదకత, కార్మిక సంతృప్తి పెరిగి పరిశ్రమలు విజయవంతంగా నడుస్తాయన్నారు. పెట్టుబడులను ఆకర్షించడంతోపాటు కార్మికులకు మేలు చేయాలనే ద్విముఖ వ్యూహంతో సీఐఐ, ఫాప్సీ వంటి పారిశ్రామిక వర్గాల ప్రతినిధులతో విస్తృతంగా చర్చించి, వారిని కూడా విశ్వాసంలోకి తీసుకున్నామని కమిటీ వెల్లడించింది. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి, కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా ప్రతి ఐదేళ్లకోసారి కనీస వేతనాల సవరణ చేపట్టడం ఎంతో అవసరమని కేబినేట్​సబ్ కమిటీ పేర్కొందని తెలిపారు. ఈ కనీస వేతనాల సవరణ నిర్ణయం వల్ల రాష్ట్రంలోని సుమారు కోటీ 11 లక్షల మంది కార్మికులకు ప్రత్యక్షంగా లబ్ధి చేకూరనుందని తెలిపారు. ఇందులో అత్యధికంగా 70 నుండి 75 లక్షల మంది అన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్కిల్డ్ (నైపుణ్యం లేని) కేటగిరీ కార్మికులు ఉండగా, సెమీ స్కిల్డ్ విభాగంలో 21 లక్షలు, స్కిల్డ్ విభాగంలో 15.64 లక్షల మంది ఉన్నట్లు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లేబర్ కోడ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కూడా పరిగణనలోకి తీసుకుంటూ, అటు పరిశ్రమల ప్రయోజనాలను, ఇటు వర్కర్ల జీవన ప్రమాణాలను సమతూకం చేస్తున్నట్లు తెలిపారు. 


గల్ఫ్​ ఏజెంట్ల దోపిడీకి చెక్​

గత 40, 50 ఏండ్లుగా జగిత్యాల, కరీంనగర్, సిరిసిల్ల, కోరుట్ల ప్రాంతాల నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లే పేద కార్మికులు ఏజెంట్ల చేతిలో మోసపోతున్నారని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దోపిడీని అరికట్టేందుకు ప్రభుత్వమే గల్ఫ్ వలసలను సంస్థాగతం చేయబోతోందన్నారు. స్కిల్ యూనివర్సిటీలో డ్రైవర్లు, కన్స్ట్రక్షన్ లేబర్లకు 6 నెలల ప్రత్యేక శిక్షణ ఇవ్వడంతో పాటు పాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్, పోలీస్ వెరిఫికేషన్ ప్రక్రియను ప్రభుత్వమే పూర్తి చేస్తుందన్నారు. విదేశాల్లో ఏ కంపెనీకి ఎంత మంది అవసరమో తెలుసుకొని ఇక్కడి నుంచి పంపితే కార్మికులకు కనీస వేతనం, ఉద్యోగ భద్రత లభిస్తుందని చెప్పారు. గతంలో గల్ఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కార్మికులు చనిపోతే శవాన్ని తెచ్చుకునే పరిస్థితి కూడా లేకుండేదని, కానీ తమ ప్రభుత్వం చనిపోయిన కార్మికుడి కుటుంబానికి రూ. 5 లక్షల బీమా ఇవ్వడంతో పాటు శవాన్ని స్వస్థలానికి తెప్పించే గొప్ప వ్యవ స్థను తీసుకొచ్చిందని గుర్తుచేశారు. సమావే శంలో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, ఎంపీలు, విప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

కేటగిరీల వారీగా జీతాలు (రూపాయలలో)
                        జోన్- I                జోన్- II             జోన్- III
అన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్కిల్డ్     16,000                 15,000              14,000
సెమీ స్కిల్డ్    17,000              16,000               15,000
స్కిల్డ్              18,500                17,500            16,500
హైలీ స్కిల్డ్    20,000                19,000         18,000