గచ్చిబౌలిలోని టిమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మూతవడ్డది

గచ్చిబౌలిలోని టిమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మూతవడ్డది
  • ఇన్‌‌పేషెంట్‌‌ సర్వీసులను పూర్తిగా బంద్‌‌ పెట్టిన సర్కార్‌‌‌‌
  • నామమాత్రంగా అవుట్‌‌ పేషెంట్‌‌ సర్వీసులు
  • నిరుపయోగంగా ఎక్విప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ 
  • ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పేషెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్వీసులను పూర్తిగా బంద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెట్టిన సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • నామమాత్రంగా అవుట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేషెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్వీసులు

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గచ్చిబౌలిలోని తెలంగాణ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెడికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సైన్సెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రీసెర్చ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (టిమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మూతవడ్డది. దీంతో కోట్ల రూపాయల విలువ చేసే మెడికల్, ఇతర ఎక్విప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిరుపయోగంగా మారింది. రూ.లక్షలు పెట్టి కొనుగోలు చేసిన బెడ్లన్నీ ఓ మూలన పడేశారు. ఈసీజీ, 2డీ ఎకో తదితర మెషినరీలను పక్కన పెట్టేశారు. డిసిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా అక్కడి నుంచి మరో దవాఖానకు తరలించకపోవడంతో, దుమ్ము పట్టి పోతున్నాయి. గిఫ్ట్ ఏ స్మైల్ కింద వచ్చిన రెండు అంబులెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు నిరుపయోగంగా పడ్డాయి. కరోనా రోగులకు ట్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ అందించేందుకు 2020లో గచ్చిబౌలి టిమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఇక్కడ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పేషెంట్ సర్వీస్ పూర్తిగా బంద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెట్టారు. కంప్లీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా క్లోజ్ చేస్తే విమర్శలు వస్తాయన్న ఉద్దేశంతో, నామమాత్రంగా ఒకరిద్దరు డాక్టర్లతో అవుట్ పేషెంట్ సర్వీసులు నడిపిస్తున్నారు. 

కొత్తవి కడ్తమని, ఉన్నది మూసేశారు..

హైదరాబాద్ చట్టుపక్కల నాలుగు సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లను కడతామని 2014 ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. 2018 ఎన్నికల మేనిఫెస్టోలోనూ ఈ విషయాన్ని పొందుపర్చారు. ఇందులో భాగంగా గచ్చిబౌలిలో తొలి హాస్పిటల్ ప్రారంభిస్తున్నామని చెప్పిన కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. దీనికి తెలంగాణ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌(టిమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) అని పేరు పెట్టారు. కరోనా సమయంలోనే గచ్చిబౌలి స్పోర్ట్ కాంప్లెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సుమారు రూ.15 కోట్లు ఖర్చు దవాఖానగా మార్చారు. బెడ్లు, మందులు, ఎక్విప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ అన్ని ఏర్పాట్లు చేశారు. టిమ్స్ అని బోర్డు పెట్టి, ఇతర దవాఖాన్ల నుంచి డాక్టర్లు, సిబ్బంది డిప్యుటేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీద కరోనా పేషెంట్లకు ట్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ అందించడం ప్రారంభించారు. కరోనా తగ్గాక అన్ని రకాల వైద్య సేవలను ఇందులో అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. కానీ, ఇప్పుడు ఇందుకు విరుద్ధంగా హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మూసివేశారు. సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి తెస్తామని చెప్పి, అసలు దవాఖాననే లేకుండా చేస్తుండటం గమనార్హం.