తెలంగాణలో ఇంటర్ ఆన్ లైన్ క్లాసులు వాయిదా

తెలంగాణలో ఇంటర్ ఆన్ లైన్  క్లాసులు వాయిదా

తెలంగాణ‌లో ఇంట‌ర్మీడియట్ ఆన్ లైన్ క్లాసులు వాయిదా ప‌డ్డాయి. రాష్ట్రంలో రేపటి నుంచి దూరదర్శన్, టీ-శాట్ ఛానళ్లలో ఇంటర్మీడియట్ డిజిటల్ క్లాసులు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఎడతెరిపి లేకుండా వ‌ర్షాలు కురుస్తున్న కార‌ణంగా..డిజిట‌ల్ క్లాసుల నిర్వ‌హ‌ణ‌ను వాయిదా వేస్తున్న‌ట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. త్వరలోనే డిజిటల్ తరగతులు ప్రారంభించే కొత్త తేదీలను ప్రకటిస్తామని ఇంటర్మీడియట్ సెక్రటరీ సయ్యద్ ఉమర్ జలీల్ ఓ ప్రకటనలో స్పష్టం చేశారు.