పంచాయతీరాజ్ ఉద్యోగుల ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫర్లకుముహూర్తం ఖరారు!

పంచాయతీరాజ్ ఉద్యోగుల ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫర్లకుముహూర్తం ఖరారు!
  • నేటి నుంచి 26 వరకు బదిలీల కౌన్సెలింగ్
  • మల్టీ జోనల్, జోనల్ క్యాడర్ పోస్టులకు షెడ్యూల్ రిలీజ్
  • ఉత్తర్వులు జారీ చేసిన పీఆర్ కమిషనర్ డి. దివ్య

హైదరాబాద్, వెలుగు: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల బదిలీలకు లైన్ క్లియర్ అయింది. మల్టీ జోనల్, జోనల్ క్యాడర్ పోస్టులకు సంబంధించి బదిలీల కౌన్సెలింగ్ షెడ్యూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను గురువారం పంచాయతీరాజ్ కమిషనర్ డి. దివ్య విడుదల చేశారు.  బదిలీల కోసం ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు నిర్ణీత తేదీల్లో, నిర్ణీత వేదికల వద్ద కౌన్సెలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు హాజరుకావాలని ఆదేశించారు. 22 నుంచి 26వ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. శుక్రవారం పంచాయతీ కార్యదర్శులు (గ్రేడ్-I, II & III)లకు ఉదయం 10:30 గంటలకు రంగారెడ్డి జిల్లా పరిషత్ మీటింగ్ హాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కౌన్సెలింగ్ ఉంటుంది.

23వతేదీన డిప్యూటీ సీఈఓలు, ఎంపీడీఓలు, డీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీఓలు, సీనియర్ అసిస్టెంట్లు (డీపీఓ యూనిట్), ఎంపీఓలు (మల్టీ జోన్–-II), సూపరింటెండెంట్లు (జోన్–-I నుంచి IV) వరకు, 25 వతేదీన ఎంపీఓలు (మల్టీ జోన్–-I), సూపరింటెండెంట్ల(జోన్–-V, VI & VII)కు,  26న సీనియర్ అసిస్టెంట్లు (జోన్-–I నుంచి VII వరకు) కౌన్సెలింగ్ ఉంటుంది.

చాలా పోస్టులకు రంగారెడ్డి జిల్లా పరిషత్ మీటింగ్ హాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కౌన్సెలింగ్ నిర్వహించనుండగా.. డిప్యూటీ సీఈఓలు, ఎంపీడీఓలు, ఎంపీఓలకు (మల్టీ జోన్-–II) హైదరాబాద్ ఖైరతాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని కమిషనర్ కార్యాలయ మినీ మీటింగ్ హాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. బదిలీలకు దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులందరికీ సమాచారం అందించి, వారు సకాలంలో కౌన్సెలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు హాజరయ్యేలా చూడాలని జిల్లా పరిషత్ సీఈఓలు, డీపీఓలను కమిషనర్ ఆదేశించారు. బదిలీల ప్రక్రియను అత్యంత ప్రాధాన్యత అంశంగా పరిగణించాలని సూచించారు