మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల
  • అక్టోబర్ 10న పోలింగ్.. అదే రోజు ఫలితాల వెల్లడి

హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (2021 – 2023) ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల అయింది. వచ్చే నెల 10వ తేదీన జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌లో ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది. అదే రోజు రాత్రిలోగా ఫలితాలు ప్రకటిస్తారు. ఎన్నికల నోటిఫికేషన్‌ ను ఎన్నికల అధికారి వి.కృష్ణమోహన్‌ జారీ చేశారు. 
ఎన్నికల షెడ్యూల్..
ఈ నెల 27 నుంచి 29 వరకూ నామినేషన్లు స్వీకరణ
ఈనె 30న నామినేషన్ల పరిశీలన
అక్టోబర్ 1-2 తేదీల్లో సాయంత్రం 5 గంటల వరకూ నామినేషన్ల ఉపంసంహరణ
అక్టోబర్ 2వ తేదీన ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితా ప్రకటన
 అక్టోబర్‌ 10న ఎన్నికలు పోలింగ్.. అదే రోజు రాత్రి ఏడు గంటలకు ఫలితాల వెల్లడి
నియమ నిబంధనలు: 
ఒక అభ్యర్థి ఒక పోస్ట్‌ కోసమే పోటీ చేయాలి.
గత కమిటీలో ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌ అయి ఉండి, 50 శాతం కన్నా తక్కువ ఈసీ మీటింగ్‌లకు హాజరు కాకపోతే పోటీ చేసే అర్హత ఉండదు. 
24 క్రాఫ్ట్స్ ఆఫీస్‌ బేరర్స్ గా ఉన్న వారు ఆ పదవులకు రాజీనామా చేయకపోతే ‘మా’ ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులు కారు.